విశాఖపట్నం

శోకంతో ఉన్నాం... బాధించకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 16: భర్త మరణించి పుట్టెడు దుఖఃలో ఉన్న తమను మరింత బాధపెట్టేవిధంగా వ్యవహరించడం తగదని దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు భార్య పరమేశ్వరి వాపోయారు. తన భర్త సర్వేశ్వర రావును మావోయిస్టులు హతమార్చిన ఘటనపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పందించిన తీరు తీవ్ర అభ్యంతర కరంగా ఉందంటూ ఆమె నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభ హైమావతితో కలిసి జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మంగళవారం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఎంత ఆగ్రహం లేకపోతే ఒక మహిళా నక్సలైట్ ఎమ్మెల్యే కిడారిని హతమార్చిందంటూ పవన్ వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. మావోయిస్టుల ఘాతుకానికి భర్తను కోల్పోయి, ముగ్గురు పిల్లలతో పుట్టెడు దుఖఃలో ఉన్న తమను మావవీయ కోణంలో ఓదార్చాల్సింది పోయి, అనవసర వ్యాఖ్యలతో మరింత ఆవేదన కలిగించడం బాధకలిగించిందన్నారు. తన భర్తను నక్సలైట్లు హతమార్చడం సరైన చర్యగా పవన్ కల్యాణ్ అభిప్రాయ పడటం దారుణమన్నారు. దారుణ ఘటనలో భర్తను పొగొట్టుకున్న తనపై జాలి చూపకపోయినా బాధించేలా ప్రవర్తించవద్దని కోరారు. జీవీఎంసీ వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో కిడారి సర్వేశ్వర రావు కుమారుడు సందీప్ కుమార్, నగర టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నంరెడ్డి వాణి తదితరులు పాల్గొన్నారు.

చిరిగిన నోట్ల మార్పిడికి ఆర్బీఐ నిబంథనలు
ఆనందపురం, అక్టోబర్ 16: బ్యాంకుల్లో చిరిగిన నోట్ల మార్పిడి విషయంలో కొన్ని నిబంధనలు తాజాగా చేశారు. ముఖ్యంగా 2వేలు, 2వందలు నోట్లు చిరిగిన స్థాయిని బట్టి వాటి విలువ పూర్తిగా లేది సగంగా లెక్కకట్టించనున్నారు. ఈ మేరకు ఆర్బీఐ నుండి బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. నూతన నిబంధనల ప్రకారం 2వందలు, 2వేల నోట్లతో పాటు మహాత్మా గాంధీ కొత్త సిరీస్ కలిగిన రూ.10, 20, 50, 100నోనట్లకు ఈ నింబంధనలు వర్తించనున్నాయి. పాత సిరీస్ నోట్లతో పోలిస్తే ఈ నిబంధనలు వర్తించనున్నాయి. పాత సిరీస్ నోట్లతో పోలిస్తే వీటిసైజు చిన్నవిగా ఉంటుంది. ఈ నేపధ్యంలో చిరిగిన కొత్త సీరీస్ నోటు మార్పిడిలో పూర్తి విలువ చెల్లింపునకు సంబంధించి ఆర్బీఐ నింబంధనలు మార్చింది. ఆర్బీఐ 2009లో చేపట్టిన సవరణల ప్రకారం ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు డిజిగ్నేటెడ్ బ్యాంకు శాఖలు, ఆర్బీఐ కార్యాలయాల్లో ముక్కలైన, పాడైపోయిన నోట్లను మార్చుకోవచ్చు. 2016 నవంబరు 8నాటి నోట్ల రద్దుకు ముందు 5నుండి 1000రూపాయిలు మధ్యకుచిరిగిన నోట్లవరకు మాఅథం నోట్ రిఫండ్ నిబంధనలున్నాయి. తాగాగా 2వందలు, 2వేల నోట్లనుకూడా ఈ పరిధిలోకి తీసుకురావడానికి కొత్త నిబంధనలు రూపొందించారు. ఆర్బీఐ కొత్తనిబంధనలు ప్రకారం 2వేలు నోటు పూర్తి రిఫండ్ చేయాలంటే కనీసం 88చదరపు సెంటీమీటర్లు కలిగి ఉంటుంది. ఒకవేళ 44 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా చిరిగిపోతే సగం విలువ చెల్లిస్తారు. రూ.200నోటు 78చదరపు సెంటీమీటర్లు బాగుంటే పూర్తిగా చెల్లిస్తారు. 39 చదరపు సెంటీమీటర్లు కంటే ఎక్కువగా చిరిగిపోతే సగం విలువ మాత్రమే చెల్లించే విధంగా నిబందనలున్నాయి.

టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్ల ప్రతిపాధన
ఆనందపురం, అక్టోబర్ 16: ఉత్తరాంధ్ర టీటర్ల ఎమ్మెల్సీగా పోటీచేయడానికి రొంగలి రాంబాబు (అనకాపల్లి), కె.శివప్రసాద్ (ఆనందపురం)పేర్లను ప్రతిపాదిస్తూ ఉతరాంధ్ర జిల్లాల తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తీర్మానించింది. మంగళవారం ఇక్కడ జరిగిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశంలో ప్రతిపాదించారు. టి.ఎన్.యు.ఎస్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వి.ఎస్.రాజేంధ్రప్రసాద్ వర్మ అధ్యక్షత వహించారు. తెలుగుదేశం పార్టీ తరుపున వీరిద్దరిలో ఎవరికైన టిక్కెట్లు కేటాయించాలని వర్మ చేసిన ప్రతిపాదనకు అన్ని జిల్లాల నాయుకలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉపాధ్యాయ ఉద్యమంలో ఉన్న వీరిలో ఎవరిని అభ్యర్ధిగా నిర్ణయించినా వారి గెలుపుకోసం పనిచేస్తామన్నారు. కాగా రాష్ట్ర కోశాధికారి కె.హరీష్‌రావు, శ్రీకాకుళం నాయకులు కె.్భసర్కరరావు, పి.సూరిబాబు, ఓంకార్ తమ అంగీకారాన్ని సంయుక్తంగా ప్రకటించారు.

ట్రిపుల్ ఐటికి గొట్టిపల్లి విద్యార్ధి ఎంపిక
ఆనందపురం, అక్టోబర్ 16: మండలంలోని గొట్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధి మీసాల మణికంఠ నూజివీడు ట్రిపుల్ ఐటికి ఎంపికయ్యాడు. ఏనుగులపాలేంకు చెందిన దివ్యాంగ విద్యార్ధి మీసాల మణికంఠ గొట్టిపల్లి హైస్కూల్‌లో టెన్త్ వరకూ చదివి 9వ గ్రేడు సాధించాడు. ట్రిపుల్ ఐటికి ధరఖాస్తు చేసుకోగా రెండో విడత కౌన్సిలింగ్‌లో ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మణికంఠను స్థానిక హెచ్.ఎం. రుత్తల సన్యాసిరావు, కోరాడ నాయుడుబాబు, బాలవికాస్ ఇన్‌చార్జి డివిఎస్ కిరణ్, డబ్బీరు విజయ్‌కుమార్, కె.తమ్మునాయుడు, శరత్‌కుమార్, త్రినాధ్, చైతన్య, ఉపాధ్యాయులు అభినందించారు.

ఎన్.వి.పాలేంలో అన్నదానం
ఆనందపురం, అక్టోబర్ 16: మండలంలోని లొడగలవాని పాలేం గ్రామంలో దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని మంగళవారం మూడు వేల మందికి ఉత్సవ కమిటి అన్నదానం నిర్వహించింది. ఈ కార్యఅకమానికి భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జి చిక్లా విజయబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అన్ని దానాల్లోకెల్ల అన్నదానం గొప్పదన్నారు. ఉత్సవ కమిటి చైర్మన్ లొడగల రమణ మాట్లాడుతూ తొమ్మిది రోజులు పాటు నిర్వహించి ఈ ఉత్సవాలను కుమాతాలకు అతీతంగా ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. సహపంక్తి భోజనాలతో స్నేహభావం సోదర భావం పెరుగుతుందన్నారు. మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కాకర వెంకటరమణ, మాజీ జెడ్‌పిటిసి సభ్యురాలు బమ్మిడి ఉమ, ఎండిటిసి లొడగల వెంకటరావు, దుక్క ముసలయ్య, బిఆర్‌బి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
జాతరలో అలరించిన కూచిపూడి నృత్యాలు
మధురవాడ, అక్టోబర్ 16: స్థానిక శిల్పారామం జాతరలో దసరా ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జానపద, కూచిపూడి నృత్యాలు ఆహుతులను అలరించాయి. నగరానికి చెందిన దేవిక కూచిపూడి నృత్యాలయ వారిచే కూచిపూడి నృత్యాలు, కుసుమ జానపద బృందం వారిచే జానపద నృత్యాలు మరియు తాతబాబు పేరడీ డాన్స్‌లు ప్రేక్షకులను అలరించాయి. కళాకారులు మోనాలిస, మాధురి, సాయి కీర్తన, రామలక్ష్మి, ధరణి, ప్రియదర్శిని, జాగృతి, జయత్రి, జెస్సిక, వర్షిత, త్రిపురలు ప్రదర్శించిన మహాగణపతి, శివతాండవం, శ్రీనివాసకళ్యాణం, కృష్ణావతారం, మహిషాసుర మర్ధిని, అబ్బవాడు, రాజాంకొండమీద, నా అందంచూడు, కోయిరాలే అన్న పాటలకు నృత్యాలు ఆకుట్టుకున్నాయి. అలాగే తాతబాబు ప్రదర్శించిన పేరడీ నృత్యం ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించింది. దేవిక, కసుమ, తాతబాబు నృత్యదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక శిల్పారామం జాతర పరిపాలనాధికారి టి.విశ్వనాధరెడ్డి పర్యవేక్షించారు.

శ్రీ మహాలక్ష్మిగా దుర్గాదేవి
మధురవాడ, అక్టోబర్ 16: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమించారు. చంద్రంపాలేం జాతర గట్టుపై వెలసిన శ్రీశ్రీశ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో జరుపుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఉదయం 7గంటలకు పంచామృతాభిషేకం, కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి అవతారంలో అలంకరించారు. అమ్మవారికి సహస్త్ర పుష్పార్చన, హోమం, సూర్యనమస్కారాలు నిర్వహించారు. ఉదయం 10గంటల నుండి కోటి కుంకుమార్చనలు జరిపించారు. అమ్మవారికి చంద్రంపాలేంకు చెందిన పిల్లా సూరిబాబు, వరలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో ప్రసాదం ఏర్పాటుచేశారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటి సభ్యులు తీర్థ ప్రసాదాలు ఉచితంగా పంపిణీచేశారు.

లక్ష్మీ అవతారంలో దుర్గాదేవి
భీమునిపట్నం, అక్టోబర్ 16: దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మంగళవారం లక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమించారు. స్థానిక కళ్యాణవేంకటేశ్వర ఆలయం, చోడేశ్వర భీమేశ్వర ఆలయంలో నెలకొల్పిన దుర్గమాత విగ్రహాలకు ధనం, కనక వస్తువులు, పూలు తదితర వస్తువులతో లక్ష్మీదేవిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన పూజలు నిర్వసించబడ్డాయి. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే తగరపువలస 10వ వార్డు ఎన్టీఆర్ కళ్యాణ మండపం 9వ వార్డు పాత లోకల్ ఆఫీసు విధుల్లో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ తగరపువలస శాఖ అధ్యక్షుడు కొప్పల రమేష్ ప్రారంభించారు.

కెజిబివి విద్యార్ధులకు ముగిసిన శిక్షణ
భీమునిపట్నం, అక్టోబర్ 16: స్థానిక గొల్లలపాలేం వద్ద గల కస్తురిబా గాంధీ బాలికల విద్యాలయంలో గల విద్యార్ధులకు జాతీయ ప్రతిభ పరిశోధన (ఎన్‌టిఎస్‌ఇ) పరీక్షలపై గతవారం రోజులుగా ఇస్తున్న శిక్షణ మంగళవారంతో ముగిశాయి. ముగింపురోజు శిక్షణాతరగతులను ఎస్‌ఎస్‌ఎ రాష్ట్ర పరిశీలకులు వై.నరసింహారావు పరిశీలించారు. కోర్సు డైరెక్టర్ జిల్లా బాలికాభివృద్ధి అధికారి సిహెచ్ రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో 34కెజిబివి పాఠశాలల నుండి పాఠశాలకు ముగ్గురుచొప్పున మొత్తం 117మంది ప్రతిభగల విద్యార్ధులు తరగతుల్లో పాల్గొని శిక్షణ పొందారన్నారు. వీరికి గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్, మెంటల్ ఎబిలిటిలపై ముగ్గురు రిసోర్స్ పర్సన్‌లు ప్రత్యేక శిక్షణ ఇచ్చారన్నారు. శిక్షణ పొందిన విద్యార్ధులకు నవంబరు 4న పరీక్షలు నిర్వహించనున్నామని పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రతిభ చూపిన విద్యార్ధులకు పిజి స్థాయి వరకు రూ.1200 స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం ఇవ్వనుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కెజిబివి ప్రత్యేక అధికారి గ్రేస్‌లిల్లీ తదితరులు పాల్గొన్నారు.