విశాఖపట్నం

‘సీఆర్‌జెడ్’ సరళీకరిస్తే ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 16: కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధలను సడలిస్తే, పర్యావరణానికి, మత్స్యకారులకు ముప్పువాటిల్లుతుందని పలువురు పర్యావరణవేత్తలు, వివిధ పార్టీల ప్రతినిధులు స్పష్టం చేశారు. సీఆర్‌జెడ్ నోటిఫికేషన్ ప్లాన్‌పై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి స్థానిక వుడా చిల్డ్రన్స్ థియేటర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో పలువురు మాట్లాడుతూ సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సీఆర్‌జెడ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించే తీరును ప్రతినిధులు తప్పుపట్టారు. సీఆర్‌జెడ్ నిబంధనలను సడలిస్తే, సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఉపాధి కోల్పోవలసివస్తుందని అన్నారు. చెన్నైకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి డాక్టర్ సౌందర్య రాజన్ ఈ సందర్భంగా సీఆర్‌జెడ్ ప్లాన్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తీర ప్రాంతంలో నివసించే ప్రజలను కాపాడ్డం, వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి సీఆర్‌జెడ్‌ను 1,2,3,4,5 కేటగిరీలుగా విభజించామని చెప్పారు. సముద్ర మట్టానికి 12 నాటికల్ మైళ్ల దూరం వరకూ విపత్తు ప్రాంతంగా గుర్తించామని చెప్పారు. 1:25 కోస్టల్ జోన్ మ్యాప్ కూడా తయారు చేశామని ఆయన తెలియచేశారు. అధిక సముద్రపు పోటు గుర్తింపు హద్దును, అధిక అలలవృద్ధి కలిగిన సముద్రపు గట్టు ప్రాంతాన్ని గుర్తించామని సౌందర్య రాజన్ తెలియచేశారు. మడ అడవులు, ఉప్పుగల్లీలు, బ్యాక్ వాటర్ ప్రాంతాలు, బురద ప్రాంతాలను ఎకలాజికల్ సెన్సిటివ్‌గా పరిగణలోకి తీసుకుని వస్తామని ఆయన తెలిపారు. సీఆర్‌జెడ్-2 సముద్ర తీర ప్రాంతానికి అభివృద్ధి చెందిన మున్సిపల్, నగర ప్రాంతాలను చేర్చామని చెప్పారు. సీఆర్‌జెడ్-3లో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన, చెందని ప్రాంతాలను, సీఆర్‌జెడ్-4లో సముద్రం లోపల 12 నాటికల్ మైళ్లు ఉన్న ప్రాంతం, సీఆర్‌జెడ్-5లో క్రిటికల్ వర్ణలబుల్ తీర ప్రాంతాలను చేర్చామని ఆయన పేర్కొన్నారు.
కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విశాఖ తీర ప్రాంతం 528 కిలో మీటర్ల పొడవు ఉందని, జోన్‌లు ఏఏ ప్రాంతాల్లో ఉన్నవాటిని గుర్తించి ప్లాన్‌ను తయారు చేశామని చెప్పారు. తయారు చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్‌లో ఉంచామని, జీవీఎంసీ, వుడా తదనుగుణంగా మ్యాప్‌ను తయారు చేసిందని తెలిపారు. అందరి అభ్యంతరాలను, అభిప్రాయాలను కేంద్రానికి పంపుతామని చెప్పారు. ప్రజా సంఘాల ప్రతినిధులు లోకనాధం, డీ.పాల్, ఎం.పైడిరాజు, వాసుపల్లి శ్రీనివాసరావు, జానకిరావు, అప్పలరాజు, ఏ.పీ.్ఛంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సాంబశివరావు, హెచ్‌పీసీఎల్ అధికారి వై.వీ.ఎస్.శర్మ తదితరులు మాట్లాడుతూ సీఆర్‌జెడ్ ప్లాన్ చట్ట వ్యతిరేకంగా ఉందని, మత్స్యకార గ్రామాలు నాశనమై, ప్రజలను అన్యాయానికి గురవుతున్నారని వాపోయారు. దివీస్, ఎస్‌ఈజెడ్, బ్రాండిక్స్, రామ్‌కీ తదితర పరిశ్రమల నుంచి రసాయనిక వ్యర్థాలను పైపుల ద్వారా సముద్రంలోకి విడిచిపెడుతున్నారని అన్నారు. పర్యావరణం, కలుషితమై జలచరాలు, తాబేళ్లు, పక్షులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అభ్యంతరాలపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమాధానం చెపుతూ సీఆర్‌జెడ్ ఉల్లంఘనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీం కోర్టు నోటిఫికేషన్ ఇచ్చిందని, ఈ మేరకు తాము ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సేకరించిన అభిప్రాయాలను, సూచనలను నివేదికను కేంద్రానికి పంపుతామని చెప్పారు. 2011లో సీఆర్‌జెడ్ నోటిఫికేషన్ వచ్చిన తరువాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో ప్రతిపాదిక ప్రణాళికను తయారు చేశామని చెప్పారు. ఈ ప్లాన్‌ను వెబ్‌సైట్‌లో ఉంచామని తెలియచేశారు. ఈ ప్లాన్ తయారీలో ఎటువంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయసేకరణకు హాజరైన పలువురు సీఆర్‌జెడ్‌కు సంబంధించి కొన్ని వినతులను కలెక్టర్ ప్రవీణ్‌కు అందచేశారు. ఈ ప్రజాభిప్రాయసేకరణలో వీఎంఆర్‌డీఏ కమిషనర్ బసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తిత్లీ బాధితులకు ఐటీఏఏపీ వితరణ
విశాఖపట్నం, అక్టోబర్ 16: తిత్లీ తుపాను బాధితులకు ఐటీఏఏపీ ఆధ్వర్యంలో పునరావాస సామాగ్రిని పంపించారు. 320 యూనిట్ల దుప్పట్లు, 335 చీరలు, 272 తువ్వాళ్లు, 15,350 కొవ్వొత్తులు, 4200 అగ్గిపెట్టెలు, 65 టార్పాలిన్‌లు పంపించారు. ఐటీఏఏపీ ప్రతినిధి ఒ నరేష్‌కుమార్ నేతృత్వంలో సామాగ్రిని మంగళవారం వాహనాల్లో తరలించారు.

కస్టమ్స్ కార్యాలయంలో స్వచ్ఛ పక్షోత్సవాలు
విశాఖపట్నం, అక్టోబర్ 16: విశాఖపట్నం సీజీఎస్‌టీ అండ్ కస్టమ్స్ జోన్‌లో ఈ నెల 15 నుంచి స్వచ్ఛ పక్షోత్సవాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగం పదిహేను రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ కమిషనర్ వరుణ్ కౌండిన్య ఒక ప్రకటనలో తెలిపారు. పక్షోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం పందిమెట్ట జంక్షన్‌లో పెయింట్, కర్టూన్ చిత్రాల కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే ఈనెల 23న ఆర్కే బీచ్ పరిసరాలను శుభ్రం చేయడం, 30వ తేదీన జగదాంబ జంక్షన్‌లో పర్యావరణ పరిక్షణ నిమిత్తం గోనె సంచుల పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అలాగే కార్యాలయంలోను, వివిధ పాఠశాలల్లోను స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో కస్టమ్స్ కమిషనర్ డీకే శ్రీనివాస్, సీజీఎస్‌టీ కమిషనర్ డీ వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజలు
విశాఖపట్నం (కల్చరల్), అక్టోబర్ 16: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హెచ్‌బీ కాలనీ సంజయ్‌గాంధీ నగర్‌లో వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మంగళవారం సాయంత్రం కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పంచామృతాభిషేకం, పుణ్యాహవచనం, కలశస్థాపన అనంతరం సహస్ర కుంకుమార్చన జరిపారు. ఆలయ అర్చకులు రవి శర్మ ఆధ్వర్యంలో జరిగిన కుంకుమార్చనలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి పూజించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనడం పట్ల మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పట్నాల వేంకటరమణ, ఉపాధ్యక్షుడు సత్య సుందరరాము, కార్యదర్శి మురళీకృష్ణ సహా పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.