విశాఖ

చైతన్య స్రవంతి మహిళా స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 12: చైతన్య స్రవంతి మహిళా స్వచ్ఛంద సంస్థ సేవలు శ్లాఘనీయం, అభినందనీయమని జీవీఎంసి కమిషనర్ హరినారాయణన్ అన్నారు. కాన్ఫరెన్స్ హాలులో చైతన్య స్రవంతి 30 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా చైతన్య స్రవంతి, గృహలక్ష్మి మేక్స్ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు, ఆర్ధిక స్వావలంబనకు తార్కాణంగా పేర్కొన్నారు. పేదరికంలో ఉన్న మహిళలు పొదుపు చేసిన బియ్యాన్ని అందజేయడంపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. అలాగే స్వచ్ఛత కాలుష్య నివారణలో భాగస్వాములైనందుకు అభినందనలు తెలిపారు. ఒక స్వచ్చంధ సంస్థ 30ఏళ్ళు నిరంతరంగా సమాజసేవ చేయడం చిన్న విషయం కాదని అభిప్రాయం వ్యక్తంచేశారు. నగరంలో చైతన్యస్రవంతి స్ఫూర్తిగా తీసుకోని మరింత మంది ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా నైట్ షెల్టర్ హోంకు బియ్యం, రూ.30వేల నగదు అక్షయ పాత్ర ప్రతినిధి (అన్న క్యాంటీన్‌కు) ఒక లక్ష అక్షయపాత్ర సంస్థకు రూ.25వేలు చెక్‌ను పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ షిరీన్ రెహమాన్ చైతన్యస్రవంతి ఏర్పాటు, చేసిన సేవలు గురించి వివరించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహ్మన్, యుసిడి ప్రాజెక్టు డైరెక్టర్ డి.శ్రీనివాసన్, లయన్స్ మాజీ గవర్నర్ దుర్గాప్రసాద్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో కార్యదర్శి కె.అశోక్‌కుమారి, వైస్-ప్రెసిడెంట్ జె.విజయశంకర్, గృహలక్ష్మి మేక్స్ సొసైటీ అధ్యక్షుడు యం.విజయకుమారి, కార్యదర్శి రుకియాబాబు తదితరులు పాల్గొన్నారు.

15న జర్నలిస్టుల ఉచిత మెగా వైద్య శిబిరం
* సభ్యులు సద్వినియోగపర్చుకోవాలి
* విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల
విశాఖపట్నం, జూలై 12: వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వీజేఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు తెలిపారు. గురువారం డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టుల ఫోరమ్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళా ఆసుపత్రి సౌజన్యంతో ఈ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో సభ్యుల కోసం గ్రంథాలయం, జిమ్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సమావఏవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాఆసుపత్రి అధినేత డాక్టర్ పివి రమణమూర్తి మాట్లాడుతూ సమాజం కోసం నిరంతరం పాటు పడుతున్న జర్నలిస్టులు వారి ఆరోగ్యంపై కూడా దృష్టిసారించాలని అవసరం ఉందన్నారు. జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం కూడా పురోగభివృద్ది సాధిస్తున్నామన్నారు. అవసరమైన వారికి ఇసిజి, ఎక్స్‌రే, స్కానింగ్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీజేఎఫ్ ఉపాధ్యక్షుడు నాగరాజుపట్నాయక్, నానాజీ, పియస్ మూర్తి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.