విజయవాడ

పెదవాల్తేరు గణపతి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: స్థానిక పెదవాల్తేరులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీగణపతి దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి నుంచి ప్రతి రోజు స్వామి వారు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి వారిని బుధవారం సాయంత్రం ఊరేగించనున్నట్టు ఆలయ ధర్మకర్త గణపతిరాజు శ్రీనివాస శర్మ, ఆలయ అర్చకులు ద్వివేదుల రవిశంకర్ తెలియచేశారు. గురువారం ఉదయం స్వామికి లక్షపత్రి పూజ నిర్వహించనున్నారు. శనివారం భారీ ఎత్తున అన్న సంతర్పణ జరపనున్నట్టు శ్రీనివాస శర్మ వెల్లడించారు.

అప్రజాస్వామిక చర్యల్ని ఖండించండి
విశాఖపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 18: ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు భంగం వాటిల్లేలా ప్రవర్తించి, ప్రబోధాశ్రమంలో భక్తులను భయభ్రాంతులకు గురిచేసిన జేసీ సోదరుల ఆగడాలను ఖండించాలని ప్రబోద సేవా సమితి, హిందూ జ్ఞానవేదిక విశాఖ అధ్యక్షుడు ఏన్‌బీ నాయక్ కోరారు. వీజేఎఫ్‌లో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చినపొలమడ గ్రామంలోని ఆశ్రమంలో ఇటీవల జరిగిన ఘర్షణల్లో భాగంగా భక్తుల్ని బలవంతంగా తరలించే ప్రయత్నం జరిగిందన్నారు. అప్రజాస్వామికమైన ఈ చర్యలు నిరసిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, దర్యాప్తు కమిటీ భక్తులు ఆశ్రమంలో ఉండి తమ ఆధ్యాత్మికతను నిర్వహించుకునేలా అనుమతిచ్చిందన్నారు. గత కొంత కాలంగా జేసీ సోదరులు స్వప్రయోజనాల కోసం ఆశ్రమంపై దాడులు కొనసాగిస్తున్నారన్నారు. ప్రబోధానంద స్వామిని ఇతర బాబాలతో పోల్చి కించపరుస్తున్నారన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఇటువంటి చర్యలకు అడ్డుకట్టవేసేలా ప్రభుత్వం పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల కుటుంబాలు అనుసరిస్తున్న త్రైత సిద్ధాంతాన్ని గౌరవించేలా దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో కన్వీనర్ అద్దంకి గిరిబాబు పాల్గొన్నారు.