విశాఖపట్నం

భూ బదలాయింపు చట్టాన్ని అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, సెప్టెంబర్ 19: అరకులోయ పట్టణంలో భూ బదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సి.పి.ఎం. నాయకులు పొద్దు బాలదేవ్, కె.రామారావు, భగత్‌రాం కోరారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గిరిజనుల రక్షణ కవచంగా ఉన్న ఈ చట్టాన్ని సమర్థంగా అమలు చేయకపోవడం వలన గిరిజనులకు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. గిరిజనుల భూములతో పాటు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతవౌతున్నాయని, ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తే దీనిని నివారించవచ్చునని వారు చెప్పారు. భూ బదలాయింపు చటాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుడడం వలన అనర్హులు ఈ ప్రాంతంలోని భూములను ఆక్రమించుకుంటున్నారని వారు అన్నారు. అరకులోయ పట్టణ పరిసరాల్లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యారని వారు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీ పరిధిలోని అరకులోయ పట్టణంలో గిరిజనేతరులు దర్జాగా అక్రమ నిర్మాణాలకు పూనుకుంటున్నారని, దీనిపై రెవన్యూ అధికారులకు పిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోతుందని వారు అన్నారు. బతుకుతెరువు కోసం పట్టణ ప్రాంతాల నుంచి అరకులోయకు వచ్చిన కొందరు గిరిజనేతరులు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు సాగిస్తున్నారని వారు పేర్కొన్నారు. మంచినీటి వనరులైన బావులు, బోర్‌వెల్స్‌ను సైతం పూడ్చివేసి నిర్మాణాలు చేస్తుండడం దారుణమని వారు అన్నారు. ప్రభుత్వ భూముల్లో పక్కా భవనాలు నిర్మించి వ్యాపారాలు చేసుకుని ధనార్జనకు పాల్పడుతున్న గిరిజనేతరులపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అనంతరం స్థానిక ఇన్‌చార్జి తాహశీల్ధార్‌కు వినతిపత్రం సమర్పించారు.

పోలీసు స్టేషన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలి
ఆరిలోవ, సెప్టెంబర్ 19: నేరస్తులపై పోలీసుల దాష్టీకాలు మితిమీరుతున్నాయని, వీటిని నియంత్రించేందుకు అన్ని పోలీసు స్టేషన్లలోను సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని విశాఖ పౌర హక్కులసంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. సీసీఎస్ స్టేషన్‌లో పైడిరాజు లాకప్ డెత్ నేపథ్యంలో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది ఎన్‌హెచ్ అక్బర్ మాట్లాడుతూ పోలీసు స్టేషన్లలో అధికారులు నిందితుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. నేరుస్తులచే నిజాలు చెప్పించేందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, కొన్ని సందర్భాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లి జీవచ్ఛవాలుగా మారుతున్నారన్నారు. పోలీసుల తీరు వల్ల పౌరులు జీవించే హక్కు కోల్పోతున్నారన్నారు. స్టేషన్లలో పౌరులకు రక్షణ ఉండాలంటే సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలో పౌర హక్కుల సంఘం ప్రతినిధులు టీ శ్రీరామ్మూర్తి, కొత్తపల్లి వెంకటరమణ, కేవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

బీడీపీ రావుకు జయకుమార్ రావు సాహితీ పురస్కారం
ఆరిలోవ, సెప్టెంబర్ 19: కవిసార్వభౌమ పురుషోత్తమ చౌదరి శాస్ర్తియ సంగీత మహోత్సవాలు సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు దారు బీడీపీ రావుకు డాక్టర్ జయకుమార్ రావు నూతకతోటి స్మారక సాహితీ పురస్కారం అందజేశారు. పురుషోత్తమ చౌదరి మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో కళాభారతి ఆడిటోరియంలో బుధవారం జరిగిన మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేశారు. పురస్కార గ్రహీత ఆంధ్ర, క్రైస్తవ కీర్తనల కవికాలాదులు, సాహితీ విశేషాలను ఆహుతులకు వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మల్లాది సూర్యనారాయణ శాస్ర్తీ, ప్రభాకరరావు, ట్రస్టు వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జయకుమార్ నూకతోటి, కార్యదర్శి వీ కుమారౌ దాస్, పీ రాజేంద్ర ప్రసాద్, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. చివరి రోజున ప్రఖ్యాత కర్నాటక సంగీత విధ్వాంసురాలు ఎం శశిరాణి భక్తిగీతాలు మధురంగా ఆలపించి సంగీత ప్రియులను అలరించారు. పాల్‌రాజ్ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.