విశాఖపట్నం

24న గిరిజన ఉపాధ్యాయులు సామూహిక సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 22: గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా ఈ నెల 24వ తేది సోమవారం సామూహిక సెలవులు పెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయ సంఘం నాయకులు రేగం సూర్యనారాయణ, బాణం శ్రీనివాసుదొర, పోతురాజు పిలుపునిచ్చారు. స్థానిక తలారిసింగ్ ఆశ్రమోన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికై ఈ నెల 24వ తేదిన పాడేరు ఐ.టి.డి.ఎ. కార్యాలయం ఎదుట మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉపాధ్యాయులంతా ధర్నాకు విధిగా హాజరు కావలసి ఉన్నందున సామూహిక సెలవులు పెట్టాలని వారు సూచించారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు అధికారాలను తొలగిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జి.ఒ.నెంబరు 132ను రద్దు చేయాలని, జి.ఒ.నెంబరు 233 ప్రకారం మంజూరైన వెయ్యి 319 పోస్టులను భర్తీ చేయాలని, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు నోషనల్ ఇంక్రిమెంటు కల్పించాలని, భాషా పండితులు, పి.ఇ.టి. పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని, సి.పి.ఎస్. విధానాన్ని రద్దు చేసి పాత పించన్ విధానాన్ని అమలు చేయాలని, 2001వ సంవత్సరంలో నియామకం పొందిన గిరిజన ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఆశ్రమ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. విలేఖరుల సమావేశంలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు బాలయ్య, కె.చిట్టిబాబు, కె.రామారావు, కె.నాగేశ్వరరావు, జి.జె.ఆర్.మజ్జి, యు.ఆర్.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
పాడేరు, సెప్టెంబర్ 22: జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శనివారం వ్యాసరచన, వకృత్వ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్.ఎస్.క్రిష్ణ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో పురోగతిని సాధించాలని కోరారు. తమలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసుకునేందుకు పోటీలలో పాల్గొనాలని ఆయన సూచించారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీలలో గెలుపొందిన వారికి ఈ నెల 24న జాతీయ సేవా పథకం దినోత్సవం సందర్భంగా బహుమతులు ఇవ్వనున్నట్టు ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి జి.గౌరిశంకరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఎ.మురళీధర్, పి.కోటేశ్వరరావు, కె.అప్పలనాయుడు, కె.్ధర్మారావు, రాధాకుమారి, సునీత తదితరులు పాల్గొన్నారు.

రైలు ట్రోల్ ఫ్రీ 182పై అవగాహన
అరకులోయ, సెప్టెంబర్ 22: మండలంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభిస్తున్న విద్యార్థులకు రైల్వే సెక్యూరిటీ హెల్ప్‌లైన్ 182పై రైల్వే పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక ఆర్.పి.ఎఫ్. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామక్రిష్ణ ఆధ్వర్యంలో విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు రైళ్ల ప్రయాణికులు, మోటార్ యూనియన్ సభ్యులు, స్థానికులకు 182పై అవగాహన కల్పించిన ఆయన గత పది రోజుల నుంచి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. రైళ్లలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ ఈ 182పై అవగాహన కలిగి ఉండాలన్న ఉద్ధేశ్యంతో గత కొంతకాలం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడి నుంచైనా ఈ నెంబరును ఉపయోగించుకోవచ్చునని ఆయన చెప్పారు. రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఈవ్‌టీజింగ్ చేసినా, భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఈ నెంబరుకు ఫోన్ చేసి ప్రయాణించే రైలు వివరాలు చెబితే తక్షణ సహాయం అందుతుందని ఆయన అన్నారు. రైలు ప్రయాణికులు అపరిచితులు ఇచ్చే తినుబండారాలను, శీతల పానీయాలను తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, రైళ్లలో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్.పి.ఎఫ్. ఎస్.ఐ. సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

అన్న సమారాధన
అరకులోయ, సెప్టెంబర్ 22: స్థానిక గణేష్ యువజన సంఘం శనివారం అన్నసమారాధన నిర్వహించింది. అరకులోయ పట్టణంలోని ప్రధాన రహదారిలో వినాయక మండపం ఎర్పాటు చేసిన సంఘం ఎస్.బి.ఐ.కు వెళ్లే మార్గంలోఅన్నసమారాధన నిర్వహించడంతో దాదాపు మూడు వేల మంది భక్తులు హాజరై గణపతి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జగదీష్‌పాత్రో, సురేష్‌పాత్రో, ప్రణీత్, కె.రమేష్‌బాబు, గోల్డ్ బుజ్జి, బేతా రాజారావు, సర్వదేముళ్లు, సి.హెచ్.చంటి పాల్గొన్నారు.

చంద్రబాబుతో జగన్‌కు పోలికా
* మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి
మాడుగుల, సెప్టెంబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రతిపక్ష నేత జగన్ ఎందులో పనికివస్తారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం దేశం పార్టీ ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడు ప్రశ్నించారు. గత ఐదు రోజులుగా ఆయన నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర శనివారం ముగిసింది. మండలంలోని సాగరం, జంపెన, ఎం.కె.వల్లాపురం, ఎం.కోటపాడు, మాడుగులలో సైకిల్ యాత్రను చేపట్టి, గ్రామాలలో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రజలలో వ్యతిరేకతను కూడగట్టుకున్నారని అన్నారు. అవినీతి అక్రమాల్లో మునిగిపోయిన ఆయన చంద్రబాబు వంటి ఉన్నత నాయకుడిపై విమర్శలు చేయడం దిగజారుడుతనాన్ని సూచిస్తుందని ఆయన చెప్పారు. తన తప్పులు తెలుసుకోకుండా వ్యవహరిస్తున్న జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి జైలుపాలైన చరిత్రను మరువరాదని ఆయన హితవు చెప్పారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ నీతివంతమైన పాలన అందిస్తున్న చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న పార్టీ తమదేనని ఆయన చెప్పుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుస్ప్రచారాన్ని ప్రజలంతా వివేకంతో తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మాడుగుల శాసనసభ్యుడు బూడి ముత్యాలనాయుడు తమ అధినేత జగన్ మార్గంలోనే పయనిస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయలేని బూడి తన స్వార్థ ప్రయోజానాల కోసం ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ఆయన దుయ్యబెట్టారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలో దేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం సస్యసామలం అవుతుందని రామానాయుడు చెప్పారు. అనంతరం ఎం.కోటపాడులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యువనేస్తం పథకంపై ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు నందారపు సన్యాసిరావు, కర్రి నాగమణి, బుద్దాల రమణ, మజ్జి తాతబాబు, పుప్పాల అప్పలరాజు, శ్రీనాధు మధు, గండి శ్రీను, తాళపురెడ్డి రాజు, పి.అప్పారావు, నందారపు పానాపతి, రాపేటి జోగినాయుడు, మజ్జి విశ్వనాధం, వి.బాలు, తదితరులు పాల్గొన్నారు.