విశాఖపట్నం

ప్రయోగాలతో మరింత సృజనాత్మకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: ప్రయోగాలతో కూడిన అభ్యాసం విద్యార్థుల సృజనాత్మకతను పెంచుతుందని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బీచ్‌రోడ్డులోని ఆంధ్రా యూనివర్శిటీ కనె్వన్షన్ సెంటర్‌లో ఆదివారం జరిగిన ఏపీ పాలిటెక్ ఫెస్ట్-2018ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్ ఫెస్టివల్‌కు రాష్ట్ర వ్యాప్తంగా సుమా రు 2770 వరకూ ఎంట్రీలు అందాయని, వీటిలో 300 ప్రాజెక్టులు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. ప్రతి విద్యార్థి నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే విధం గా పాలిటెక్నిక్ విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. సమాజాన్ని మార్చి, అభివృద్ధి చేసే శక్తి కేవలం విద్యకే ఉందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ విద్యకు రూ.25వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించామన్నారు. ప్రభు త్వ పాఠశాలల్లో అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభు త్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వర్చువల్, డిజిటల్ క్లాస్‌రూంల ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూల్స్‌కు దీటుగా పనిచేస్తున్నాయన్నారు.జ్ఞానభేరి కార్యక్రమం ముఖ్యమంత్రి ఆలోచనగా పేర్కొంటూ ఇప్పటి వరకూ తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో నిర్వహించామన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థు ల్లో దాగి ఉన్న సృజనాత్మకత, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు వెలుగు చూస్తాయన్నారు. జ్ఞానభేరిలో అన్ని అంశాలను విద్యార్థుల చేతుల మీదుగానే నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులతో చర్చించడం ద్వారా వారిలో పట్టుదల పెరుగుతుందని, తద్వారా వారు రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే విధంగా పనితీరు మెరుగుపరచుకుంటారన్నారు. అంతకు ముందు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పాండాదాస్ విద్యార్థుల కెరీపై పలు అంశాలను విశదీకరించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని, లాటరల్ ఎంట్రీ ద్వారా వీరు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా చేరి ఉన్నత చదువులు చదువుకోవచ్చన్నారు. ఫ్యాకల్టీ విద్యార్థులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పూర్వ విద్యార్థులు కమల, అమూల్య తదితరు తమ అనుభవాల ను విశదీకరించారు. కార్యక్రమంలో ఆంధ్రాయూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు, ఎమ్మెల్సీలు పీవీఎన్ మాధవ్, శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ పాల్గొన్నారు.

రాజకీయాల పేరిట వ్యక్తిగత దూషణలు సరికాదు
* నేరచరిత్ర ఉన్న వారిని అందలం ఎక్కిస్తున్న బీజేపీ * మాజీ ఎమ్మెల్యే, మైనార్టీ సీనియర్ నేత ఎస్‌ఎ రెహమాన్
జగదాంబ, సెప్టెంబర్ 23:రాజకీయాల పేరిట వ్యక్తిగత దూషణలకు దిగటం సభ్యతా కాదనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆలోచించాలని మాజీ ఎమ్మెల్యే, ఏపీ మైనార్టీ సీనియర్ నేత డాక్టర్ ఎస్ ఎ రెహమాన్ అన్నారు. నగరంలో ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఒకప్పుడు విలువలకు కట్టుబడి ఉండేదని, కానీ ఇప్పుడు రోజురోజుకు సమాజాని హితానికి భిన్నంగా మారి వ్యక్తిగత దూషించుకునే విధంగా మారడం దారుణమన్నారు. నెహ్రూలాంటి మంచి నాయకులు ఉన్న రోజుల్లో మంచి నాయకులు మంచి సిద్ధాంతాలతో రాజకీయాలు ఉండేవని గుర్తు చేశారు. అంతర్జాతీయ రక్షణ రంగం విమానాల కోనుగోలు దళారిలతో సాంఘిత్యం, మాటల గారిడి కలగలపి బీజేపీ నాయకత్వం ఈ దేశంలో వున్నందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. గుజరాత్ మారనకాండ, నోట్లరద్దులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చేసిన నిర్వాకం, ఆయన కొడుకు చేసిన ఆర్థిక నేరాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. తనకున్న పరిధిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విశాఖ అభివృద్ధికి కృషి జరిగిదంటే పార్లమెంట్ సభ్యుడు ఎంపీ హరిబాబు, వెంకయ్యనాయుడులని కొనియాడారు. ఇటువంటి వ్యక్తులను తప్పించిన అమిత్‌షా ఏపీని తొక్కేయాలని, చంద్రబాబును ఇరాకటంలో నెట్టాలని, అమరావతి కూడా నిర్మాంచుకోకడదని కుట్రలు పన్నుతున్నారన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నో కేసుల్లో ఆరోపణల్లో ఉన్నారని, ఆయన తనలా టి వ్యక్తినే ఏపీ అధ్యక్షడుగా నియామించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇష్టానుసారాంగా తిట్టడం సరికాదని,వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించాడటంతోనే వారి వైఖరి బయటపడిందిన్నారు. కన్నా లక్ష్మీనారాయణ తనకున్న గజదొంగ పేరు కప్పిపుచ్చుకునేందుకు ఏపీపై బురదజల్లడం సరికాదని హెచ్చరించారు. రాష్ట్భ్రావృద్ధికి పార్టీలతో సంబంధం లేకుండా సహకరించాలన్నారు.