శ్రీకాకుళం

విశ్వశాంతి స్థాపనకు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 25: విశ్వశాంతి స్థాపనకు ప్రతీ ఒక్కరు కృషిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పిలుపునిచ్చారు. పట్టణంలోగల లూథరన్ చర్చిలోజరిగిన క్రిస్మస్ సంబరాల్లో శుక్రవారం కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసు విశ్వశాంతికి ప్రయత్నించారన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రపంచంలో అనేక చోట్ల అశాంతి నెలకునుందని అటువంటి ప్రాంతాల్లో శాంతి నెలకొల్పాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఏసుక్రీస్తు ప్రేమా, శాంతి సేవాతత్పరతను లోకానికి పంచిపెట్టిన గొప్ప మహానుభావుడన్నారు. అయన మార్గం అనుసరిణీయమని సూచించారు. ప్రతీ ఒక్కరికీ ప్రేమ పంచి ఇవ్వడం ద్వారా ఎదుట వారిలో దైవత్వాన్ని చూడవచ్చునని చెప్పారు. వారిలో గల ద్వేషాలను తొలగించి ప్రేమతత్వాన్ని పెంచవచ్చునని తెలిపారు. సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతులు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నైతిక విలువలు అవసరమన్నారు. ప్రపంచ శాంతి స్థాపనకు మానవుల్లోగల మార్పుకు కృషి చేసిన ఏసుక్రీస్తునకు ఆనాటి ప్రభువులు శిలువ వేసారని అయినప్పటికీ చలించలేదన్నారు. సహనం కలిగిన వ్యవస్థలో అనర్థాలు కలుగవన్నారు. సులభజీవశైలి హంగు ఆర్భాటాలు లేని జీవనం ప్రబోధించారని చెప్పారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలను చెప్పారు. తొలుత పాస్టర్ సుధాకర్ బాబు దైవ ప్రార్థన చేశారు. ఈ వేడుకల్లో చర్చి అధ్యక్షులు టి. జె హెన్రీ, జ్యోతిఫెడ్రిక్, ఎస్తేర్ రాణి, డేవిడ్ రాజు, శ్యామ్యూల్ రాజు తదితరులు పాల్గొన్నారు.