అంతర్జాతీయం

ఓడిపోయిన యువతికి విశ్వసుందరి కిరీటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిస్ యూనివర్స్ పోటీలో పెద్ద పొరపాటు
తరువాత సవరించుకున్న అతిథి స్టీవ్ హార్వే

లాస్‌ఏంజిల్స్, డిసెంబర్ 21: గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి విశ్వసుందరిని ప్రకటించడంలో పెద్ద పొరపాటు జరిగింది. మిస్ యూనివర్స్ 2015 పోటీలకు అతిథిగా వచ్చిన స్టీవ్ హార్వే పొరపాటుగా తొలి రన్నర్- అప్‌గా నిలిచిన మిస్ కొలంబియాను విశ్వసుందరిగా ప్రకటించారు. వాస్తవానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 80 మంది అందమైన యువతులను వెనక్కి నెట్టి మిస్ ఫిలిప్పీన్స్ పియా అలోంజో వుర్ట్‌జ్‌బాచ్ విశ్వసుందరిగా నిలిచారు. అయితే కొద్దిసేపటికే తన పొరపాటును గ్రహించిన హార్వే కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు క్షమాపణలు చెప్పారు. లాస్ వెగాస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రజలు గందరగోళంలో ఉండగా హార్వే జరిగిన అసలు విషయాన్ని వివరించారు. తానే పొరపాటు చేశానని, అందువల్ల ఈ పొరపాటుకు తానే బాధ్యత వహిస్తానని ఆయన సభాముఖంగా ప్రకటించారు. అయితే హార్వే ఈ దిద్దుబాటు ప్రకటన చేయడానికి కొన్ని క్షణాల క్రితమే మిస్ కొలంబియా అరియాద్నా గుటియెర్రెజ్‌కి విశ్వసుందరి కిరీట ధారణ జరిగిపోయింది. విశ్వసుందరి కిరీటాన్ని ధరించిన అరియాద్నా కొలంబియా జాతీయ పతాకాన్ని చేబూని గాలిలో ఊపుతూ, చిరుదరహాసంతో ప్రేక్షకులవైపు గాలిలోనే ముద్దు లు చిందించారు. హార్వే తిరిగి వేదికపైకి వచ్చేసరికి వుర్ట్‌జ్‌బాచ్ తుది పోటీలో ఓడిపోయిన నిరాశలో అక్కడ నిలబడి ఉండటం కనిపించింది. ఆ వెంటనే మిస్ కొలంబియా తలపై ఉన్న విశ్వసుందరి కిరీటాన్ని తీసి తన తలపై పెట్టడంతో వుర్ట్‌జ్‌బాచ్ అమితమైన ఆశ్చర్యానికి లోనయ్యారు. తరువాత హార్వే సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో తన పొరపాటుకు క్షమాపణ చెప్పారు.
అయితే ఆయన ఇంకో పొరపాటు కూడా చేశారు. మొదటి ట్విట్టర్ సందేశంలో ఆయన రాసిన కొలంబియా, ఫిలిప్పీన్స్ పేర్లలో అక్షర దోషాలు దొర్లాయి. తరువాత ఆ సందేశాన్ని తొలగించారు.