కృష్ణ

నిరంతర విద్యార్థిగా న్యాయవాది కొనసాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జనవరి 31: ప్రతి న్యాయవాదీ నిరంతర విద్యార్థిగా కొనసాగాలని హైకోర్టు జడ్జి జస్టిస్ జి చంద్రయ్య ఆకాంక్షించారు. ఆదివారం స్థానిక కోర్టు భవనాల సముదాయంలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయం పై భాగంలో కంచర్ల లక్ష్మణస్వామి-స్వర్ణకుమారి దంపతుల జ్ఞాపకార్ధం వారి బావమరిది త్రిపురనేని రాజేంద్రప్రసాద్ తన సొంత నిధులతో నిర్మించిన లైబ్రరీ హాలును ఆయన ప్రారంభించారు. ముందుగా 11వ ఎడిజె న్యాయమూర్తి భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ 1961వ సంవత్సరంలో న్యాయవాద చట్టం అమల్లోకి వచ్చిందని, చట్టంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానంపై న్యాయవాదులు నిరంతరం అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కక్షిదారుల పట్ల న్యాయవాదులు ఓర్పు, సహనంతో మెలగాలన్నారు. గుడివాడ కోర్టుకు 124ఏళ్ళ ఘన చరిత్ర ఉందని, ఇక్కడి పురాతన కట్టడాన్ని తాను పరిశీలించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సేవాతత్పరతతో ముందుకు సాగుతూ ఎదుటివారి పట్ల గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి బి రవీంద్రబాబు మాట్లాడుతూ రూ.73లక్షలతో అదనపు జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నామన్నారు. త్వరలో సివిల్ కోర్టుల భవనానికి మరమ్మతులు చేయడంతో పాటు తాగునీటి సదుపాయాన్ని కూడా కలుగజేస్తామన్నారు. ముందుగా లైబ్రరీ హాలు నిర్మాణ దాత రాజేంద్రప్రసాద్‌ను జస్టిస్ చంద్రయ్య సత్కరించి అభినందించారు. ముందుగా కోర్టు భవనాల సముదాయంలోని న్యాయదేవత విగ్రహానికి జస్టిస్ చంద్రయ్య పూలమాల వేశారు. పూర్ణకుంభంతో జస్టిస్ చంద్రయ్యకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మొక్కలు నాటారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జస్టిస్ చంద్రయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి కె ప్రభాకరరావు, జూనియర్ సివిల్ జడ్జి కె అరుణకుమారి, ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎం సత్యకుమారి, సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేట్ దేవు నరసింహారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ ప్రభాకరరావు, కార్యదర్శి సిహెచ్ రత్నశేఖర్ తదితరులు పాల్గొన్నారు.