కృష్ణ

బిసిలంతా ఐక్యంగా ఉద్యమిస్తే గాని మోదీ, బాబుల్లో చలనం రాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 4: బిసిలంతా ఒక తాటిపైకి వచ్చి ఐకమత్యంతో ఉద్యమిస్తే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు ప్రకంపన కలిగి వారిలో చలనం వచ్చి ఇప్పటికైనా బిసిలపై చిన్నచూపు మాని బిసిలకు సమన్యాయం, రాజ్యాధికారి, బిసి పిల్లలకు విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్, సంక్షేమ ఫలాలు పంపిణీలో జాప్యం లేకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటమహేష్ ఆధ్వర్యంలో బిసి హక్కుల సాధనకై బిసి శంఖారావం మహాసభను బుధవారం ఐవి ప్యాలెస్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బిసి శంఖారావం సభను ప్రారంభించారు. సభనుద్దేశించి అనేకమంది బిసి సంక్షేమ సంఘం నాయకులు ప్రసంగాన్ని వినిపించారు. అనంతరం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బిసిలనుద్దేశించి మాట్లాడుతూ బిసిలంతా ఐక్యంగా ఉండాలన్నారు. అన్ని కులాలకు పార్టీలున్నాయి, ఒక్క బిసిలకు తప్పా. ఎవిరికివారు పార్టీలు పెట్టి తమ హక్కులను ప్రభుత్వాల నుండి సాధించుకుంటున్నారు. 138 కులాలతో ఉన్న బిసిలకు మాత్రం ఇప్పటివరకూ పార్టీ అనేది లేదు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల బిసి నాయకులతో చర్చలు జరిపి 138 కులాలను ఏకతాటిపై తీసుకొచ్చి బిసిల హక్కులను సాధించుకోవటానికి ఓ కొత్త బిసి పార్టీని త్వరలో స్థాపించనున్నట్లు కృష్ణయ్య వ్యక్తపరిచారు. బిసి పార్టీ అనేది ఉంటే 135 ఉపకులాలున్న బిసిలను ఏ ఇతర పార్టీ ఎదుర్కోలేదని, అప్పుడు రాజ్యాధికారం తమకే వస్తుందని ఇతర పార్టీల వారు కూడా తమ వద్దకే వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కిరణ్‌కుమార్ రెడ్డి జన్మలో ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తే తెల్లారేపాటికి కొత్తపార్టీ పెట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, కెసిఆర్ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా స్వలాభాలకు వెళ్లడమేకాని, బిసిల గురించి అధిష్టానంతో ఏ ఒక్కరోజు చర్చించలేదన్నారు. బిసిలు అణచివేతకు గురౌతున్నారు. తలచుకుంటే రక్తం మరుగుతుందన్నారు. రెండు రాష్ట్రాలలో కలిపి 6 వేల హాస్టళ్లు ఉన్నాయని, వీటికి విద్యతో పాటు అన్ని ఉచిత వసతులు ఏర్పాటు చేశామన్నారు. మనం లోన్లు అడిగితే ఇవ్వని బ్యాంకర్లు ఉన్నోడు లోను అడిగితే లారీల కొద్ది పైసలిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు 12 ఫెడరేషన్ల నుండి కో-ఆపరేషన్ల ద్వారా 5 లక్షల వరకు రుణాలు ఇచ్చే సౌకర్యం కల్పించామని ఇందులో 50 శాతం సబ్సిడి లభిస్తుందన్నారు. దీనిని ఉపయోగించుకుని బిసిలు రుణాలు పొంది ఆర్థికంగా ముందుకు ఎదగాలన్నారు. బిర్యానీ ప్యాకెట్లతో పెట్టే సభలు పైమాటలకే పరిమితం మన కష్టాలు గట్టెక్కాలంటే సభలకు ఐక్యతతో కలసి రావాలని పిలుపునిచ్చారు. బిసిలు పుట్టినప్పటి నుండి పుట్టెడు కష్టంతో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ముస్లిం సోదరులు ఐక్యత చూసి ప్రభుత్వాలు దిగివస్తున్నాయని, వారిలాగానే బిసిలు కూడా ఐక్యతగా ఉంటే ప్రభుత్వం మన దగ్గరికే వస్తుందన్నారు. బిసి పార్టీని స్థాపించటమే ప్రధాన ఎజెండా అన్నారు. బిసిలు బిసిలకే ఓటేస్తాము అనే సిద్ధాంతంతో ముందుకెళ్లి ఐక్యతతో ఓటు బ్యాంకు కొల్లగొట్టాలని పిలుపునిచ్చారు. బిసి శంఖారావం సభకు సిపిఐ ప్రధాన కార్యదర్శి దోనేపూడి శంకర్, బిసి నాయకులు అంగిరేకుల వరప్రసాద్, కాటంరాజు, పూర్ణచంద్రరావు, బిసి మహిలా నాయకులు సిహెచ్ వసంతరావు, డి.విజయలక్ష్మి, బిసి ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వినయ్, రాష్ట్ర నగరాల సంఘం అధ్యక్షుడు బాయన వెంకట్రావ్, నగరాల మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం అధ్యక్షుడు బేస్‌కంటేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.