విజయవాడ

పేదల గుడిసెలు తొలగించి పెద్దలకు పెత్తనమిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఇవ్వాలని, తక్షణమే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుండి పేద ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ పెద్దపెట్టున నినదించారు. ఈ ప్రదర్శన స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ప్రారంభమై పోలీసు కంట్రోల్ రూమ్, ఏలూరు రోడ్డు, ఐదవ నెంబర్ రోడ్డు, బీసెంట్ రోడ్డు, లెనిన్ సెంటర్, అలంకార్ సెంటర్ మీదుగా గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్స్ వరకు కొనసాగింది. వృద్ధులు, మహిళలు చంటిబిడ్డలను సైతం చంకన పెట్టుకుని, అన్నం మూటలు కట్టుకుని సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చి ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణానికి రుణాలు మంజూరు చేయాలంటూ నినదించారు. తమ ఓట్లతో గద్దెనెక్కి రెండేళ్లయినా ఒక్క ఇల్లుగాని, సెంటు స్థలంగాని ఇవ్వలేదంటూ పేదలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష నేతలు ప్రదర్శన అగ్రభాగాన నిలువగా, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు, పేద ప్రజలు వేలాదిగా ఎర్ర జెండాలు, ప్లకార్డులు చేతబూని ప్రదర్శనలో వారిని అనుసరించారు. ప్రదర్శన జింఖానా గ్రౌండ్స్‌కు చేరుకున్న అనంతరం జరిగిన బహిరంగ సభకు అధ్యక్షత వహించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని, పట్టాలు రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నగరంలో ఈ ప్రదర్శన, సభ నిర్వహించామన్నారు. లక్షల ఎకరాలు సింగపూర్, జపాన్ కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ పేదలకు రెండు సెంట్ల నేల ఇవ్వడానికి చంద్రబాబుకు చేతులు రావడం లేదని ఆగ్రహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలకు భూములు లేవంటూనే రాజధాని నిర్మాణం పేరుతో లక్షల ఎకరాలు బలవంతంగా రైతుల నుండి చంద్రబాబు ప్రభుత్వం దోచేస్తోందని, వారికి చిత్తశుద్ధి ఉంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కష్టమేమీ కాదన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇళ్ళు, ఇళ్ల స్థలాల సమస్య పేదవాడికి జీవన్మరణ సమస్యగా మారిందన్నారు. అనేక పోరాటాలు చేసి పేదలకు కాలువగట్లపైన, కొండలపైన నివాసాలు కల్పిస్తే, వాటిని కూడా పికేసే పనిలో ఈ ప్రభుత్వం నిమగ్నమైందని, ప్రత్యామ్నాయం చూపకుండా ఒక్క ఇల్లు కదిపినా సహించేది లేదన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబూరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పి ప్రసాద్, ఎన్‌యుసిఐ రాష్ట్ర నాయకులు బి అమర్‌నాథ్, ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకులు గొడుగు సత్యనారాయణ, ఎంసిపిఐ నాయకులు గొల్లపూడి ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మాట ఇచ్చి మోసగించిందని, ప్రస్తుతం మాటలు చెప్పి కాలం గడుపుతోందని ధ్వజమెత్తారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి ఓబులేసు, జల్లి విల్సన్, జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ వందన సమర్పణ చేశారు. ప్రజానాట్య మండలి కళాకారులు గని, చంద్రానాయక్, పిచ్చయ్య, నజీర్, కాశయ్య, రాజేష్, హనీఫ్, శ్రీనివాస్ ఉత్తేజకర గీతాలు ఆలపించారు. ఈ ప్రదర్శనలో మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గ్భావాని, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌వి రామారావు, సిపిఐ నాయకులు జి కోటేశ్వరరావు, లంక దుర్గారావు, తాడి పైడయ్య తదితరులు పాల్గొన్నారు.