విజయవాడ

కంచుకోట కడప బద్దలైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) మార్చి 20: ఇప్పటివరకు కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట అని చెప్పుకుంటున్న వారికి ఎమ్మెల్సీ ఎన్నికలో టిపిపి గెలుపుతో అదికాస్తా బద్దలైందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఇంతవరకు కడపలో ఓటమి ఎరుగని వారికి ఇది గుణపాఠమని, వైసీపీ పతనం ఇక కడప నుండే ప్రారంభమైందని అన్నారు. ఇకనుంచి ఆట మొదలవుతుందని చెప్పారు. కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తాను బీటెక్ రవిని టిడిపి ఎమ్మెల్సీగా గెలపించటం సంతోషంగా వుందన్నారు. తల్లి విజయమ్మను, బాబాయి వివేకానందరెడ్డిని గెలిపించుకోలేని జగన్ కుంటిసాకులు వెదుకుతున్నాడని విమర్శించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో అన్ని స్థానాల్లోనూ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తపర్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయ పరంపర ఇక రాబోయేకాలంలో కొనసాగుతూనే వుంటుందన్నారు. రాయలసీమకు చంద్రబాబు నీళ్లు ఇవ్వటంతో పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసే ప్రజలు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించారని గంటా స్పష్టం చేశారు. వైజాగ్ బిజినెస్ సమ్మిట్ జరుగుతుంటే విమానశ్రయంలో ధర్నా చేయటం, ఇటీవల బస్సు దుర్ఘటనలో కృష్జా జిల్లా కలెక్టర్‌ను నోటికి వచ్చినట్లు మాట్లాడటం చూస్తుంటే జగన్ తీరు ప్రజలకు అర్థమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక ప్రతిపక్షం వుండదని వ్యాఖ్యానించారు.
దిమ్మతిరిగి మైండ్ బ్లాంకైన జగన్!
* మంత్రి పీతల సుజాత
కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించటంతో ప్రజాస్వామ్యం గెలిచిందని, దీంతో దిమ్మతిరిగి జగన్ మైండ్ బ్లాంకయిందని మంత్రి పీతల సుజాత అన్నారు. సోమవారం మీడియా పాయింట్ వద్ద అమె మాట్లాడుతూ కడపలో ప్రజలు అవినీతిని తిరస్కరించి, అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్నీ వైకాపా గెలుచుకోలేకపోయిదంటే అవినీతి జగన్‌ను ప్రజలు తిరస్కరించారని అన్నారు. జగన్ తన ఇలాకాలోనే బాబాయిని గెలిపించుకోలేక అవాస్తవాలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. శ్రీశైలం జలాశయం నుండి రాయలసీమకు నీళ్లు ఇస్తుంటే జగన్ ఓర్చుకోలేక రాజకీయ మనుగడ కోసం అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2014లో అయన తన తల్లిని గెలిపించుకోలేక, ఇప్పడు బాబాయి వివేకానందరెడ్డిని గెలిపించుకోలేక తెలుగుదేశం పార్టీపై అవాకులు చవాకులు పేలుతున్నాడని ధ్వజమెత్తారు. ఆయా జిల్లాల్లో నారా లోకేష్ మంత్రు లు, ఎమ్మెల్యేలు కష్టపడి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించారని అన్నారు.
క్యాంప్ రాజకీయాలు నడిపింది జగనే!
* మంత్రి నారాయణ
ప్రతిపక్ష నాయకుడు జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంప్ రాజకీయాలు నడిపాడని మంత్రి నారాయణ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వైకాపాకు బలం లేకపోయినా అభ్యర్థిని జగన్ నిలబెట్టాడన్నారు. వా కాటి నారాయణరెడ్డి గెలుపుతో జగన్ గుణపాఠం నేర్చుకోవాలన్నారు. 87 ఓట్లతో వాకాటి విజయం సాధించారని, ఆయన గెలుపునకు కృషి చేసిన ఎంపిటీసీలు, జెడ్పీటీసీలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కడుతున్నారని జగన్ గ్రహించాలి తప్ప అవాస్తవా లు మాట్లాడి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడన్నారు. వైకాపాను చూసే తా ము కూడా తమ అభ్యర్థులను కాపాడుకోవాల్సి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మటం వల్లే తెలుగుదేశం పార్టీ అన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిందని నారాయణ స్పష్టం చేశారు.
రాజకీయమంటే డబ్బనుకుంటున్నాడు!
* కళా వెంకట్రావు ధ్వజం
రాజకీయాలంటే జగన్ డబు