విజయవాడ

నేడు వీరంకి కృష్ణకుమారి నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, మార్చి 21: పటమట సెంటర్‌లోని మున్సిపల్ సర్కిల్ త్రీ కార్యాలయంలో బుధవారం వీరంకి కృష్ణకుమారి (వీరంకి డాంగేకుమారి) కార్పొరేటర్ సీటుకు నామినేషన్ వేయనున్నారు. 2014లో టిడిపి నుండి పటమట 11వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన వీరంకి డాంగే కుమార్ ఆనారోగ్యంతో కొద్ది నెలలకే మృతి చెందిన సంగతి తెలసింది. దీంతో ఆయన సతీమణి వీరంకి డాంగే కుమారిని అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో దించుతోంది. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఉదయం 8.30 గంటలకు పటమట 11వ డివిజన్ న్యూ ఆర్‌టిసి కాలనీ రామాలయం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై పటమటలోని ప్రధాన రహదారులు గుండా సర్కిల్ త్రీ కార్యాలయానికి చేరుకొంటుంది. పెద్ద ఎత్తున ర్యాలీలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పిలుపు నిచ్చారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి అర్బన్ టిడిపి పార్టీ అధ్యక్షులు బుద్దా వెంకన్న, పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, జలీల్‌ఖాన్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కె.నాగుల్ మీరా, మేయర్ కోనేరు శ్రీ్ధర్ తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలి
బ్యాంకర్ల సమావేశంలో ఎసిజి చంద్రశేఖర్

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 21: సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి లబ్ధిదారులకు ఇచ్చే వివిధ రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన వారందరికీ ఈనెల 31వ తేదీలోగా రుణాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని విఎంసి అదనపు కమిషనర్ (జనరల్) చంద్రశేఖర్ సూచించారు. ఈ సందర్భంగా మంగళవారం విఎంసి కౌన్సిల్ హాల్లో వివిధ బ్యాంకుల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన సంక్షేమ రుణాలన్నింటినీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే మంజూరు చేయడమే కాకుండ లబ్ధిదారులకు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నగర పరిధిలోని డ్వాక్రా సంఘాలకు నిర్దేశించిన బ్యాంకు లింకేజీ రుణాలు 168 కోట్ల రూపాయలు టార్గెట్ కాగా ఇప్పటికి 130 కోట్లు మాత్రమే మంజూరు చేసారని మిగిలిన 38 కోట్లను కూడా త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. ఈవిషయంలో బ్యాంకర్లకు సోషల్ వర్కర్లు, సివోలు సహకరించాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బిసి తదితర వర్గాలకు రుణాల పంపిణీలను కూడా సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో విఎంసి యుసిడి పివో ఎంవివి సత్యనారాయణ, ఎస్‌సి కార్పొరేషన్ ఎపిఓ చంద్రశేఖర్, ఆంధ్రాబ్యాంక్ ఛీఫ్ మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.