విజయవాడ

హస్త కళలకు చేయూతనివ్వండి:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: రెండురోజులపాటు నగరంలోని మహాత్మాగాంధీ రోడ్డు, శేషసాయి కళ్యాణమండపంలో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఏపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆకృతి వస్త్ర ప్రపంచాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ బాబు ఎ సందర్శించారు. హ్యాండీక్రాఫ్ట్స్‌ను ప్రోత్సహించి కళాకారులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రదర్శనలు వున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన కొండపల్లి, ఏటికొప్పాకతోపాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 50కి పైగా స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన చేనేత, హ్యాండ్‌లూమ్ వస్త్రాలు, కలంకారి వస్తువులు, లెదర్, స్టోన్ ఐటిమ్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి మన వారసత్వ సంపద అని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. ఉత్పత్తుల ప్రదర్శన అద్భుతంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన కళాకృతులు ఒకేచోట ఏర్పాటు చేయటం అభినందనీయమని కలెక్టర్ ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. శ్రీశైలపు చిన్న ఆచారి బియ్యపు గింజపై శ్రీరామపట్ట్భాషేకం, వీణ, తలవెంట్రుకపై చిలకలు, కొంగలు చెక్కిన కళాఖండాలను జిల్లా కలెక్టర్ ఆసక్తిగా పరిశీలించారు. తమ్మిశెట్టి లక్ష్మణరావు స్టాల్‌ను పరిశీలించి ప్రత్యేకంగా వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను భర్తీచేయాలి
విజయవాడ, మార్చి 21: నవ్యాంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది యువత, విద్యార్థులు ఉపాధి, ఉద్యోగాల కోసం అన్ని అర్హతలూ ఉండి ఎదురుచూస్తున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం ఎపిపిఎస్‌సి ద్వారా నామమాత్రంగానే నోటిఫికేషన్లను విడుదల చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్తటం లేదని, కేవలం రూ. 500 కోట్లు నిరుద్యోగ భృతికి 2017-18 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించి మరోమారు నిరుద్యోగ యువతను మోసం చేస్తుందని ఎపిఎస్‌వైఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నవనీతం సాంబశివరావు విరుచుకుపడ్డారు. మంగళవారం సింగ్‌నగర్ రైతుబజార్ దగ్గరలోని లూనా సెంటర్‌లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, ఈ బడ్జెట్‌లోనే నిరుద్యోగ భృతికి రూ. 20వేల కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సమాఖ్య (ఎపిఎస్‌వైఎఫ్) ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వం కేవలం 6వేల ఉద్యోగాలకు మాత్రమే ఎపిపిఎస్‌సి ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. 4వ బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన రూ. 500 నిరుద్యోగ భృతి 60 లక్షల యువత, విద్యార్థులు అర్హులుగా ఉంటే ఒక్కొక్క నిరుద్యోగికి కేవలం రూ. 187 మాత్రమే భృతిగా అదికూడా ఈ ఏడాది మాత్రమే వస్తుందని, ఇది మరోసారి నిరుద్యోగులను మోసం చేయటమేనని నవనీతం విమర్శించారు. 23న సర్దార్ భగత్‌సింగ్ 86వ వర్ధంతి కార్యక్రమం వాడవాడలా ఎపిఎస్‌వైఎఫ్ నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి వైవి రమణరావు అధ్యక్షత వహించగా నాయకులు తమ్మిన గణేష్, లంకా గోవిందరాజులు, చక్కరాజు, కాసాని గణేష్, ఎల్ శశిరేఖలు మాట్లాడారు.