విజయవాడ

అధికార, ప్రతిపక్ష అధినేతలారా... అగ్రి బాధితుల ఆక్రందన వినిపించడం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 21: రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ కారణంగా అన్యాయానికి గురైన బాధితుల ఆక్రందనలను అధికార, ప్రతిపక్ష నేతలు వినాలని పలువురు నేతలు సూచించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ వేగవంతం చేసి యాజమాన్య సోదరులను ఆరెస్టు చేయడంతోపాటు తమ డిపాజిట్లు తమకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఏజెంట్లు, ఖాతాదారులు మంగళవారం నగరంలో భారీ ప్రదర్శనతో కదం తొక్కారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బందర్‌రోడ్డు మీదుగా గవర్నర్‌పేట లెనిన్ సెంటర్ వరకూ ప్రదర్శన జరిపి అక్కడ సభ నిర్వహించారు. సభలో సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ, సినీనటుడు శివాజీ, చలసాని వెంకటేశ్వరరావు, ముప్పాళ్ల, నాగేశ్వరరావు, దోనేపూడి శంకర్ మాట్లాడుతూ గత 15రోజులుగా నగరంలో రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోని వైనం దారుణమన్నారు. ఏజెంట్లు, కస్టమర్లు రోడ్డుమీద పడి ఏడుస్తుంటే ప్రభుత్వానికి వారి ఘోష వినిపించడం లేదాని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చ జరిపించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే సెక్రటేరియేట్ ఎదుట ఆత్మహత్యలు చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సమస్య పట్ల చంద్రబాబుకు ఎంత బాధ్యత ఉందో జగన్‌కు అంతే బాధ్యత ఉందన్నారు. లక్షల మంది బాధితులు ఓట్లు వేసి గెలిపించినప్పుడు వారి బాధలు మీకు పట్టవా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు బకాయిలు చెల్లించాల్సిన ప్రక్రియలోనూ నేతలు మీన మేషాలు లెక్కిస్తున్న వైనం గర్హనీయమన్నారు.