విజయవాడ

రాష్ట్రంలో కరవు విలయతాండవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 23: రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోంది.. సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైన ప్రభుత్వం.. రైతులు వలస పోతున్నారు.. అంటూ పలువురు ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసన మండలిలో రాష్ట్రంలో కరవు పరిస్థితిపై గురువారం స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య చర్చను ప్రారంభిస్తూ, కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సాగు విస్తీర్ణం తగ్గుతోందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కరవు, నివారణ చర్యల గురించి ప్రస్తావన లేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 10 లక్షల హెక్టార్లకు నీళ్లు లేవని, మరో 10 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోతోందన్నారు. దీని వల్ల దాదాపు 4500 కోట్ల రూపాయల మేర రైతులు నష్టపోతున్నారన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులు కూడా ఆశాజనకంగా లేవన్నారు. దాదాపు అన్ని పంటల విస్తీర్ణం తగ్గుతోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపుల్లో 6.4 శాతం వ్యవసాయానికి కేటాయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5.71 శాతం కేటాయించారన్నారు. కేటాయింపులు తగ్గాయని, దాణా బ్యాంక్‌లు, క్యాటిల్ హాస్టల్ ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. రెయిన్ గన్‌లు ప్రచారానికే ఉపయోగపడ్డాయని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతుంటే ప్రభుత్వం తగ్గుతోందని చెబుతోందన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇజ్రాయల్, దక్షిణాఫ్రికా దేశాల్లో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనా నీటి వినియోగం శాస్ర్తియంగా చేయడం వల్ల అధిక దిగుబడులు సాధిస్తున్నారన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల 400 మిల్లీమీటర్ల పడుతోందని, ఇతర దేశాల్లోని విధానాలు ఇక్కడ అవసరమన్నారు. వలసలు వెళ్లిన వారు మరుగుదోడ్ల వద్ద పడుకుంటున్నారని, ఆ ప్రాంతంలో దొంగతనాలు జరిగితే వీరిని తీసుకువెళ్లి విచారిస్తున్నారని తెలిపారు. కరవు నివారణకు శాశ్వత చర్యలు లేవన్నారు.