విజయవాడ

జిహాదీ కార్యకలాపాలు దేశ భద్రతకు సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 23: పశ్చిమబంగాలో ఓవైపు జిహాదీ కార్యకలాపాల పెరుగుదల, మరోవైపు తగ్గుతున్న హిందూ జనాభా, ఆపై హిందువులపై జిహాదీ శక్తుల అరాచకాలు దేశ భద్రతకు సవాల్‌గా పరిణమిస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రాంత సహ సంఘచాలక్ భూపతిరాజు శ్రీనివాసరాజు అన్నారు. సంఘ్ ప్రాంత కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభలు ఈ నెల 19, 20, 21తేదీల్లో తమిళనాడులోని కొయంబత్తూరులోని అమృత యూనివర్శిటీ ప్రాంగణంలో జరిగాయని చెప్పారు. సర్ సంఘ్‌చాలక్ మోహన్‌జీ భగవత్, సర్ కార్యవాహక్ భయ్యాజీ జోషీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి 1296 మంది ప్రతినిధులు ఈ మూడురోజుల సమావేశాల్లో పాల్గొన్నారన్నారు. అమ్మగా ఖ్యాతిగాంచిన మాతాశ్రీ అమృతానందమయి 21న ప్రతినిధి సభలకు వచ్చి ప్రతినిధులను ఆశీర్వదించి ప్రసంగించారని చెప్పారు. ప్రథమంగా ఈ సభలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాదుల దాడులు, బాంబుపేలుళ్లు, అరాచకాలు, స్ర్తిలపై జరుగుతున్న అత్యాచారాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ ప్రతినిధి సభలలో గత సంవత్సరకాలంగా సంఘం వివిధ క్షేత్రాల్లో చేసిన కార్యక్రమాలను సమీక్షించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖలు 2010వ సంవత్సరం నుండి ఇప్పటివరకు సుమారు 20వేలు దేశవ్యాప్తంగా పెరిగాయని ఆయన చెప్పారు. ఇందులో 90శాతం తరుణ శాఖలు కావటం గమనించాల్సిన విషయమన్నారు. సంఘం ప్రతి సంవత్సరం నిర్వహించే సంఘ శిక్షావర్గలలో గత సంవత్సరం ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ వర్ష శిక్షావర్గలలో మొత్తం 26,021 మంది శిక్షణ పొందారన్నారు. ప్రాథమిక (ఏడు రోజుల శిబిరం) శిక్షణ పొందిన కార్యకర్తలు 1,04,256 మంది ఉన్నారని, ప్రస్తుతం 57,185 నిత్య శాఖలు జరుగుతున్నాయని చెప్పారు. వీటిలో 53 శాతం విద్యార్థి శాఖలేనన్నారు. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న కార్యకర్తల సంఖ్య పెరుగుతోందన్నారు. 57,185 నిత్య శాఖలతో పాటు 14,896 సాప్తాహిక్ శాఖలు, 7,594 నెలకోసారి జరిగే శాఖలున్నాయని తెలిపారు. ప్రస్తుతం స్వయం సేవకుల ద్వారా 1,70,700 సేవా ప్రకల్పాలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో 690 స్థానాలలో 1150 శాఖలు, 496 సంఘ మిలన్లు జరుగుతున్నాయన్నారు. మన రాష్ట్రంలో 4000 మంది వివిధ వర్గాలు, వృత్తులకు చెందినవారు, విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌లో ఇప్పటివరకు చేరని, చాలామంది వివిధ కార్యక్రమాల్లో ఇప్పటికే పాల్గొంటున్నారని శ్రీనివాసరాజు వివరించారు. రాష్ట్రంలోని మన ష్రాంతంలో కూడా శాఖల విస్తరణ బాగా జరిగిందన్నారు. ఎక్కువ సంఖ్యలో యువకులు నిత్యశాఖా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ప్రాంతం మొత్తమీద సేవాబస్తీల్లో విద్యార్థులకు సాయంత్రం పూట తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. వనవాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటితోపాటు ప్రజల్లో మన సంస్కృతి, ధర్మం పట్ల శ్రద్ధ కలిగించేలా జాతీయ భావాలను కలగజేసేలా కార్యక్రమాలు పెరిగాయని భూపతిరాజు శ్రీనివాసులు వివరించారు. విలేఖర్ల సమావేశంలో ప్రచార ప్రముఖ్ పివి శ్రీరామశాయి పాల్గొన్నారు.

నిర్మాణ పనుల్లో అలసత్వం వీడండి
* మేయర్ శ్రీధర్ హితవు
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 23: కేంద్ర ప్రభుత్వ నిధులతో నగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్ట్రామ్ వాటర్ ప్రాజెక్టులో నిర్మిస్తున్న డ్రైయిన్ల నిర్మాణాల్లో నెలకొన్న అలసత్వంపై నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం కౌన్సిల్ భవనంలోని తన ఛాంబర్‌లో స్ట్రామ్ వాటర్ నిర్మాణ బాధ్యతలు తీసుకొన్న పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తు ప్రణాళికలను రూపొందించి ఆ మేరకు నిర్మాణాలు చేపడితేనే రానున్న వర్షాకాలం లోపుగా కనీసం యాభై శాతం పనులనైనా పూర్తి చేయవచ్చన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తొలి ప్రాధాన్యత ప్రకారం డ్రైయిన్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే నిర్మాణ సమయంలో కేవలం కాంట్రాక్టర్లపైనే భారం వేసి ఎటువంటి పర్యవేక్షణ లేకుండా జరుగుతున్న పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మేయర్ ప్రతిచోటా వర్క్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్ పర్యవేక్షణలోనే నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. నగర పర్యటనలో తాను ప్రతిరోజూ నగర పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్షలో నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, కార్పొరేటర్లు పిన్నంరాజు త్రిమూర్తిరాజు, ఉత్తమ్ చంద్ బండారి తదితరులతోపాటు పబ్లిక్ హెల్త్ సూపరిటెండెంట్ ఇంజనీర్ ఎన్ శ్రీనివాసులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రితినిధులు పాల్గొన్నారు.