విజయవాడ

‘బంగినపల్లి’ వచ్చేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ రూరల్ మార్చి, 24. విజయవాడ గ్రామీణ మండలం నున్న మార్కెట్ యార్డులో మామిడి వ్యాపారం ఇప్పడిపుడే ప్రారంభమవుతోంది. వంద ప్లాట్స్ ఉన్నప్పటికీ గత సీజన్‌లో 75 సముదాయాల్లో వ్యాపార లావాదేవీలు జరిగాయి. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి వారంరోజుల వ్యవధిలో 6 సముదాయల్లో వ్యాపార లావాదేవీలు ప్రారంభమయ్యాయి. ఉగాది నుంచి శ్రీరామ నవమి సందర్భంగా మంచిరోజులు కావడంతో మరో 20 సముదాయాల్లో మామిడి వ్యాపార లావాదేవీలు జరగనున్నాయి. జిల్లాలో 27 మండలాల్లో లక్షా 70 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మామిడి సీజన్ ఆటుపోట్ల మధ్య ప్రారంభమవుతోంది. మంచిరోజులనే భావనతో దుకాణాలు ప్రారంభిస్తున్నట్లు మేంగో గోయర్స్, మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. మామిడి పంట ఇంకా పక్వానికి రాలేదని అంటున్నారు. వారం, పది రోజులకు పక్వానికి రావటంతోపాటు ఎండలు ముదురుతున్నకొద్దీ సీజన్ ఉపందుకొంటుందని తెలిపారు. ప్రస్తుతం బంగినపల్లి రకం టన్ను రూ. 30వేలు, కలెక్టర్ రకం 15 వేలు ధర పలుకుతోంది.

దళితుల సంక్షేమమే లక్ష్యం
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 24: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ నిధుల వినియోగంలో పారదర్శకంగా వ్యవహరించడమే కాకుండా దళితులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందుబాటులోకి తెస్తున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. ప్రస్తుతం ఉన్న వసతిగృహాలను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఇందుకు అవసరమైన నిధులను ప్రపంచ బ్యాంకు ద్వారా వెయ్యి కోట్లను సమీకరిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా, ఇతర శాఖలకు, పనులకు మళ్లించకుండానే కాకుండా వినియోగించకుండా మురిగిపోయే విధానాలకు ఇక చెక్ పెడుతున్నామని ప్రకటించారు. శుక్రవారం జరిగిన శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్సీలు పిల్లి శుభాష్‌చంద్రబోస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకా శేషుబాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి రావెల సభలో సమాధానమిస్తూ మొత్తం 33 శాఖలకు సబ్‌ప్లాన్ నిధులను కేటాయిస్తుండగా వీటిలో ఇరిగేషన్, హౌసింగ్, పరిశ్రమలు, ఎడ్యుకేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర శాఖలలోనే నిధుల సక్రమ వినియోగం జరగడం లేదన్నారు. ప్రస్తుత సంవత్సరం నుంచి ఫీజు రీ ఇంబర్స్‌మెంటుకు సంబంధించి ఏ నెలకు ఆ నెల నిధులను విడుదల చేస్తున్నామన్నారు. హాస్టళ్లలోని విద్యార్థులకు 750 నుంచి 1000, 850 నుంచి 1250, 1200 నుంచి 1400 లకు మెస్ చార్జీలను పెంచుతున్నామన్నారు.
నెలలో పది రోజులు హాస్టల్ వసతులపై ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాలలో ఉండే పిల్లలను తమ సొంత పిల్లలులాగా చూసుకొంటున్నామని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 45 వసతి గృహాలను రెసిడెన్షియల్ గృహాలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్టు తెలిపారు. నో లాబ్స్ - నో డైవర్ట్ అనే నినాదంతో నిధులన్నింటినీ నూరు శాతం వినియోగించేలా చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ హాస్టళ్లలో అమలు చేస్తున్న మెనూ కాగితాలకే పరిమితమవుతోందని, టీ నీళ్ళకే దిక్కులేదు ఇక బూస్ట్ ఎలా ఇస్తారంటూ ఎద్దేవా చేసారు. మన ఇళ్ళల్లో కూడా వండుకోలేని మెనూ కూరలను చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. కనీసం గుడ్డునైనా సక్రమంగా అందించలేని దుస్థితిలో దళిత విద్యార్థు అనేక అగచాట్లు పడుతున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కేటాయిస్తున్న బడ్జెట్ నిధులను సక్రమంగా వినియోగించకుండా దారి మళ్ళించి ఇతర అవసరాలకు వినియోగిస్తున్న వైనం కేవలం ఒక్క సాంఘిక శాఖలోనే నెలకొందని విమర్శిస్తూనే శాసన మండలిలో విపక్ష సభ్యులు పిల్లి శుభాష్‌చంద్రబోస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకా శేషుబాబు మంత్రి రావెలపై ప్రశ్నల వర్షం కురిపించారు.