విజయవాడ

దళిత, గిరిజనులను దగా చేసిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) మార్చి 25: రాష్ట్ర జనాభాలో 24 శాతం ఉన్న దళిత, గిరిజన వర్గాల ప్రజలను గత కాంగ్రెస్ ప్రభుత్వం దగాచేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. శనివారం వెలగపూడి అసెంబ్లీ మీడి యా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ పేదరికం, నిరుద్యోగంతో బాధపడుతూ, వివక్షతకు గురైన ఎస్‌సి, ఎస్‌టి వర్గాల సమస్యలపై శాసనసభలో చర్చించటానికి ప్రతిపక్షానికి మనస్సు రావటంలేదన్నారు. శాసనసభ ప్రజాస్వామ్యానికి ప్రతీక అని, అటువంటి సభలో ప్రతిపక్షం ఎస్‌సి, ఎస్‌టి సమస్యలపై సహకరించకపోవ టం శోచనీయమన్నారు. రాజధానిలో 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్ర హం నిర్మించటానికి అంబేద్కర్ స్మృతి వనానికి 100 కోట్ల రూపాయల నిధు లు కేటాయించారని, శంకుస్థాపన కా ర్యక్రమానికి ప్రతిపక్షనాయకుడు జగన్‌ను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 43 వేల కోట్ల ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించి దోచుకుందని విమర్శించారు. కానీ తెలుగుదేళం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు వేలాది కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రతి గ్రామంలో ఎస్‌సి,ఎస్‌టి కాలనీలలో వౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అప్పటికే మీడియా పాయింట్ వద్ద వేచి వున్న వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ఆర్‌కె రోజా, గిడ్డి ఈశ్వరి, కళావతి, రాజ్యలక్ష్మి, తదితరులు మంత్రి రావెల ఎస్‌సి, ఎస్‌టి అభివృద్ధిపై పొంతనలేని మాటాలు చెబుతున్నారని అనగానే మీ సలహాలు, సూచనలు ఇవ్వండి అంటూ చిరునవ్వుతో మీడియా పాయింట్ నుంచి వెళ్ళిపోయారు.