విజయవాడ

మూడ్రోజుల్లో రుణాల మంజూరు పూర్తికావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 25: రెండు, మూడు రోజుల్లో బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేసి లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ బ్యాంకు అధికారులు, సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ శనివారం సాయంత్రం నగరంలోని తన క్యాంపు కార్యాలయం నుండి అన్ని బ్యాంకులకు చెందిన అధికారులు, ఎంపిడివోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా 22వేల మంది లబ్ధిదారులకు గాను 8,342 మంది లబ్దిదారులకు 49 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు 815 కోట్లకు గాను లక్ష్యానికి మించి 1206 కోట్ల రూపాయలను రుణాలుగా మంజూరు చేశామన్నారు. జిల్లాలో 1554 కోట్ల రూపాయలను స్వయం సహాయక సంఘాలకు రుణాలుగా మంజూరు చేయాలని కలెక్టర్ బ్యాంకు అధికారులను కోరారు. పెండింగ్ డాక్యుమెంటేషన్ పూర్తిచేయాలన్నారు. రానున్న 2,3 రోజుల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి కమిటీ ఎంపిక చేసినప్పటికి బ్యాంకర్లు ఇంకను మంజూరు చేయని లబ్దిదారులు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలకు వచ్చినట్లయితే డాక్యుమెంటేషన్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆదివారం అన్ని మండల కార్యాలయాలు, కార్పొరేషన్లలో బ్యాంకు మేనేజర్లు అందుబాటులో ఉండాలని కలెక్టర్ బ్యాంకు అధికారులను కోరారు. జిల్లాలోని అన్ని మండల ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు ఆదివారం సంబంధిత కార్యాలయాలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆధార్‌తో బ్యాంకు ఖాతా, మొబైల్ అనుసంధానంతో పాటు మొబైల్ బ్యాంకింగ్ ఆక్టివేషన్ ఈనెల 31వ తేదీలోగా నూరు శాతం జరగాలని ఆదేశించారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి అన్ని లావాదేవీలు నగదు రహితంగా డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తామని కలెక్టర్ బాబు.ఎ వివరించారు.