విజయవాడ

తెలుగు పాటకు ప్రాణం పోసిన ఘనుడు అన్నమయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), మార్చి 25: తెలుగు పాటకు ప్రాణం పోసిన ఘనుడు తాళ్లపాక అన్నమయ్య అని, ఆయన వైవిధ్యభరితమైన సంకీర్తనల సృష్టికర్త అనీ వక్తలు స్మరించారు. తాళ్లపాక అన్నమయ్య 514వ వర్ధంతి మహోత్సవాలను పురస్కరించుకుని విశ్వశ్రీ క్రియేషన్స్, విజయవాడ కల్చరల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు అన్నమయ్యకు అంజలి ఘటించారు. ఈసందర్భంగా తాళ్లపాక పద సాహిత్యానికి ఘనమైన సేవలు చేసిన వ్యాఖ్యాన విశారద వెంకట గరికపాటిని ఘనంగా సత్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అన్నమయ్యకు అన్నమయ్యే సాటి అని, బహుళ సంకీర్తలు శ్రీనివాసునిపై వెలయించిన అన్నమయ్య ఘనుడనీ అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ పాత్రికేయులు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలపై వెంకట్ చేసిన వ్యాఖ్యానాలు ఎనలేని పరిణతితో ప్రేక్షకులు, శ్రోతలను ఆకట్టుకుంటాయన్నారు. యువజన పురోగతి, క్రీడల శాఖ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వెంకట్ గరికపాటి అంటేనే అన్నమయ్య గుర్తుకు వస్తారన్నారు. ఎన్నో చక్కటి కార్యక్రమాలకు తన వ్యాఖ్యానంతో వనె్నతెచ్చిన వెంకట్ అన్నమయ్య సంకీర్తనలపై ఇప్పటికే 5 పుస్తకాలను వెలయించటం విశేషమని ఆయన ప్రశంసించారు.
అలరించిన అన్నమయ్య నవరాగ నందనం
అన్నమయ్య నవరాగ నందనం వ్యాఖ్యాన సహిత గాత్ర విభావరి సంకీర్తనా ప్రియులను ఆనందపరవశుల్ని చేసింది. తాళ్లపాక పద సాహిత్య విశే్లషకుడు వెంకట్ గరికపాటి సారథ్యంలో నిర్వహించిన సంకీర్తనా విభావరిలో 9 రాగాలలో స్వరపరచిన అరుదైన తాళ్లపాక పద సాహిత్య సంకీర్తనలను గాయనీ గాయకులు ఆలపించారు. ప్రతి సంకీర్తనకు వెంకట్ గరికపాటి తన విపుల విశే్లషణ అందించారు. కార్యక్రమంలో ఆలపించిన 10 సంకీర్తనల్లో 9 సంకీర్తనలను మధురసభరితంగా డా. జోశ్యభట్ల రాజశేఖర శర్మ స్వరపరచడం విశేషం. సంకీర్తనలను శ్రీ శర్మతో పాటు సినీ నేపథ్యగాయని సమీరా భరద్వాజ్, ఎంఎంఎం ప్రవీణ్‌కుమార్ ఆలపించారు.