విజయవాడ

శనిత్రయోదశి భక్తులతో ఆలయాలు కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, మార్చి 25: శనిత్రయోదశి సందర్భంగా శనివారం నగరంలోని వివిధ శనైశ్చర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామికి ప్రీతిపాత్రమైన శనివారం నాడు శనిత్రయోదశి కూడా రావటంతో భక్తుల రద్ధీకి ముఖ్య కారణంగా మారింది. పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో కొలువైన స్వామికి అభిషేకాలు నిర్వహించుకోవటానికి భక్తులు తీరారు. ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకులు రాచకొండ నాగరాజుశర్మ, రాఘవేంద్రశర్మ తదితరులు భక్తులతో స్వామికి అభిషేకాలను చేయించారు. వేకువ జామున 5గంటలకు ప్రారంభమైన భక్తుల రద్ధీ మధ్యాహ్నం 1గంట వరకు కొనసాగింది. సీతమ్మవారి పాదాల చెంత ఉన్న శ్రీ ప్రత్యేక శనైశ్చరస్వామి సన్నిధికి భక్తులు తరలి వచ్చారు. దుర్గగుడి ఇవో సూర్యకుమారి ఆదేశాలతో అర్చకులు స్వామికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.్భక్తులు స్వామికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు శ్రద్ధగా నిర్వహించుకున్నారు. వేకువ జామున 3గంటలకు స్వామికి సుప్రభావత సేవ నిర్వహించి, ప్రత్యేక పూజలనంతరం భక్తులను అంతరాయంలోనికి పంపారు. నగరానికి చెందిన పలువురు విఐపిలు స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. గవర్నపేట శ్రీ కాశీవిశే్వశ్వర అన్నపూర్ణాదేవి దేవస్థానం, కృష్ణ లంక శివాలయం, కౌతావారి శివాలయం, పాతబస్తీ శ్రీ వసంత మల్లిఖార్జున స్వామి దేవస్థానం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, కొత్తగుళ్లు, తదితర ఆలయాల ప్రాంగణాల్లోని స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

నిర్దేశిత కాలానికి ఫ్లైవోవర్ పూర్తికావాలి
* నిర్మాణ పనుల్లో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

విజయవాడ, మార్చి 25: దుర్గగుడి వద్ద నిర్మిస్తున్న ఫ్లైవోవర్ వంతెన పనులు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జరగకపోవటం పట్ల జిల్లా కలెక్టర్ బాబు.ఎ నిర్మాణ సంస్థ సోమా కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ సతీష్‌ను ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం ఆయన ఫ్లైవోవర్ నిర్మాణ పనులతో పాటు భవానీపురం కాస్టింగ్ యార్డ్‌లో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుర్గగుడి వద్ద పెడస్టిన్ అండర్ పాస్ (పియుపి) పనులు జరగకపోవటం పట్ల ప్రశ్నించారు. ఇప్పటికే సగం పియుపి పనులు జరిగాయని, మిగతా పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. గుడి వద్ద 270 మీటర్ల పొడవైన మేజర్ బ్రిడ్జి రోడ్డు పనులు సత్వరం పూర్తిచేయాలన్నారు. అనంతరం కలెక్టర్ దుర్గగుడి నుండి బయలుదేరి భవానీపురం వద్ద సోమా కంపెనీ కాస్టింగ్ యార్డ్‌లో నిర్మిస్తున్న స్పైన్స్, వింగ్స్, ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు. పనులు పూర్తి చేయటానికి కావాల్సిన భూమి, ఇతర సామగ్రి సమకూర్చుకోవాలని, నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయాలని సోమా ప్రాజెక్టు మేనేజర్‌ను కలెక్టర్ ఆదేశించారు. కృష్ణలంక బైపాస్ రోడ్డు అప్రోచ్ రోడ్డు పనులను కూడా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట సోమా ప్రాజెక్టు మేనేజర్ సతీష్, నేషనల్ హైవే డిఇ హరికృష్ణ, ఎఇఇ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.