విజయవాడ

రైల్వేస్టేషన్‌లో నగదు రహిత విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 25: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని విజయవాడ జంక్షన్‌తోపాటు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్‌లలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన డిజిపే విధానాన్ని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు ప్రారంభించారు. రైల్వేస్టేషన్‌లోని గజిటెడ్ స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో ఉన్న విఐపి లాంజ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పాల్గొన్న డివిజనల్ మేనేజర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ నగదు రహిత చెల్లింపు నవజీవనానికి మళ్లింపు పేరుతో ఏర్పాటు చేసిన విధానాన్ని ఆరు డివిజన్‌లలో పది ప్రధాన రైల్వేస్టేషన్‌లలో ఏర్పాటు చేశారన్నారు. ఇందులో భాగంగా విజయవాడ డివిజన్‌లో విజయవాడ జంక్షన్‌తో పాటు కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్‌లలో డిజిపే విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డిజిపే విధానం ద్వారా రైల్వేస్టేషన్‌లో పూర్తి స్థాయిలో క్యాటరింగ్ దగ్గర నుంచి టికెట్‌ల కొనుగోలు వరకు డిజిటల్ పే (డిజిపే) విధానం ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చని అశోక్‌కుమార్ వెల్లడించారు. అలాగే ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. విలేఖర్ల సమావేశంలో బ్రాంచి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

37,142 విద్యుత్ చౌర్యం కేసుల్లో
రూ.27.14 కోట్లు
అపరాధ రుసుము వసూలు
* విద్యుత్ శాఖ విజిలెన్స్ ఎస్‌ఇ రవి వెల్లడి
విజయవాడ (క్రైం), మార్చి 25: ఏపిఎస్పీడిసిఎల్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చౌర్యం కేసులు 37,142 నమోదయ్యాయని, ఇందుకుగాను రూ.27.14 కోట్లు అపరాధ రుసుము వసూలు చేసినట్లు విద్యుత్ శాఖ విజిలెన్స్ సూపరింటెండెంట్ ఇంజనీరు వి రవి తెలిపారు. రీజియన్ పరిధిలో మీటర్ సేల్స్‌లో అనంతపురం జిల్లా వెనుకబడి ఉందని, గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పారు. అయితే కృష్ణా జిల్లాను గుంటూరుతో సమానంగా తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ చౌర్యం కృష్ణా జిల్లాలో ఎక్కువగా జరుగుతుందనే సమాచారం మేరకు పలు మండలాల్లో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. విజయవాడలోని విద్యుత్ ప్రధాన కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు ఏపిఎస్పీడిసిఎల్ పరిధిలోని గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తనిఖీలు నిర్వహించడం ద్వారా 27.14కోట్లు జరిమానా వసూలు చేశామని తెలిపారు. ఇదే ఆర్థిక సంవత్సరంలో కృష్ణా జిల్లా విషయానికొస్తే 4186 కేసులకు రూ. 2.94కోట్లు అపరాధ రుసుము వసూలు చేశామన్నారు. ఏపిఎస్పీడిసిఎల్ పరిధిలో మీటర్ సేల్స్‌లో కృష్ణా జిల్లా 81.5వ స్థానంలో ఉందని, గుంటూరు జిల్లా 84శాతం, నెల్లూరు జిల్లా 71శాతం, కర్నూలు జిల్లా 69శాతం, ప్రకాశం జిల్లా 67శాతం, చిత్తూరు జిల్లా 57శాతం, కడప జిల్లా 50శాతం, అనంతపురం జిల్లా 46.5శాతంలో ఉన్నట్లు చెప్పారు. విద్యుత్ చౌర్యం ఎక్కువగా ఉన్నట్లు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి, ఆల్లూరు, మైలవరం, పెనుగంచిప్రోలు, గణపవరం, వత్సవాయి, వీర్లుపాడు, తదితర మండలాల్లో 14 బృందాలుగా 42మంది సిబ్బంది ఆకస్మిక దాడులు చేసి 166కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. మీటరు ఉండి బైపాస్ చేసిన కేసులు ఐదు, మీటరు లేకుండా లైన్‌కు తీగలు వేసి చౌర్యానికి పాల్పడిన కేసులు ఆరు, ఇంటికని చెప్పి వ్యాపారానికి వాడుకున్న కేసులు 10, అనధికారికంగా అదనపు లోడు కలిగిన వారిపై కేసులు 145 నమోదు చేశామని వెల్లడించారు. అక్రమ విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమని, ఈ తరహా దాడులు మరిన్ని నిర్వహిస్తామని రవి వివరించారు. విలేఖరుల సమావేశంలో విద్యుత్ విజిలెన్స్ సిఐ రవికాంత్, విజిలెన్స్ డిఇ కె వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ బస్సులకు అడ్డగోలుగా పర్మిట్లా?
* ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఎంపి కేశినేని నాని ఆగ్రహం
విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 25: ప్రైవేట్ బస్సులకు అడ్డదిడ్డంగా పర్మిట్లు ఇస్తున్న తీరుపై ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన టిఎన్‌టియుసి కార్యకర్తలను బయటకు పంపివేసిన ఆర్టీఏ సిబ్బందిపై ఎంపి కేశినేని శ్రీనివాస్(నాని) మండిపడ్డారు. నేరుగా ఉప కమిషనర్ కార్యాలయానికి బయలుదేరటంతో విషయం తెలుసుకున్న డిటిసి బైటకు వెళ్లిపోతుండగా ఎంపి కేశినేని మార్గంమధ్యలోనే అడ్డుకుని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే బొండా ఉమ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్‌మీరా, పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. దీనిపై డిటిసి కమిషనర్ జవాబు చెప్పాలంటూ ఎంపి నాని ఆగ్రహం చెందారు. అయితే మీడియాతో మాట్లాడేందుకు కేశినేని నాని నిరాకరించారు. ప్రైవేట్ బస్సులకు అక్రమంగా పర్మిషన్లు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారు. దీనివల్ల ఆర్‌టిసికి ఎంత నష్టం వస్తుందో తెలుసా మీకు అంటూ అధికారులను నిలదీశారు.