విజయవాడ

ఎస్‌ఐ అర్జునరాజు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, మార్చి 26: ఎసిబి వలలో ఆదివారం రాత్రి చిక్కిన కొత్తపేట ఎస్‌ఐ అర్జునరాజును అరెస్టు చేశారు. అవినీతి నిరోధకశాఖ అధికారులు స్టేషన్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించగా అర్జునరాజు వద్ద రూ. 38వేలు బయటపడినట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ఎసిబి డిఎస్పీ వి గోపాలకృష్ణ కథనం ప్రకారం.. పటమటకు చెందిన వీరంకి మస్తాన్‌రావు వద్ద రూ. 15వేలు లంచం డిమాండ్ చేయడంతో ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. మస్తానరావు, కాసాని అమలేశ్వరరావు అనే వ్యక్తి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఇద్దరి మధ్య వ్యాపారపరమైన విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో పాతబస్తీ వించిపేటకు చెందిన అఫీస్ అనే వ్యక్తి వద్ద మస్తాన్ రూ. లక్ష అప్పుగా తీసుకున్నాడు. తిరిగి సకాలంలో ఇవ్వలేకపోయాడు. దాంతో అఫీస్ మస్తాన్‌పై కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాన్ని అనామత్తుగా ఉంచి మస్తాన్‌ని ఎస్‌ఐ అర్జునరాజు పిలిపించాడు. మస్తాన్ తాను గతంలో ఇబ్బందుల వల్ల డబ్బు తీసుకున్నానని, కానీ అమలేశ్వరరావు తనకు రూ. 2.80 లక్షలు ఇవ్వాలని, ఆ నగదు ఇప్పిస్తే అఫీస్ బాకీ తీరుస్తానన్నాడు. అర్జునరాజు అమలేశ్వరరావుని పిలిపించి రూ. 2.80 లక్షల రెండు చెక్కులు, రెండు ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకుని అమలేశ్వరరావుని వదిలేశాడు. ఇది 2015లో జరుగ్గా అప్పటి నుండి నోట్లు, చెక్కులు మస్తాన్‌కి ఇవ్వకుండా ఎస్‌ఐ తిప్పించుకుంటున్నాడు. గత 10 రోజుల క్రితం గట్టిగా అడగ్గా లక్షకు రూ. 15వేలు చొప్పున లంచం ఇస్తే ఇస్తానని ఎస్‌ఐ తేల్చిచెప్పాడు. ఎస్‌ఐ ధోరణితో విసిగిపోయిన మస్తాన్ మూడురోజుల క్రితం అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ గోపాలకృష్ణని ఆశ్రయించాడు. వారు పథకం ప్రకారం రూ. 15వేలు ఇచ్చి పంపించారు. దళారీగా వ్యవహరించిన ఉప్పులూరు ప్రసాద్(60) ఎలియాస్ నల్లప్రసాద్ రూ.5వేలు తన జేబులో పెట్టుకుని ఎస్‌ఐకి రూ. 10వేలు ఇచ్చాడు. ఎస్‌ఐ ఆ నగదుని లాంగ్‌నోట్ బుక్‌లో పెట్టుకున్నాడు. వెంటనే రంగప్రవేశం చేసిన అ.ని.శా అధికారులు ఎస్‌ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నోట్లను కెమికల్ టెస్ట్ చేశారు. దళారీ చేతులు రసాయన పరీక్షలో రంగుమారాయి. ఎస్‌ఐ అధికారులకు సహకరించకుండా ఇబ్బందిపెట్టాడు. డబ్బులు దాచిన లాంగ్ నోట్‌బుక్‌ని రసాయన పరీక్షలు నిర్వహించగా వాటర్ రంగుమారాయి. దాంతో అర్జునరాజును నిందితునిగా నిర్ధారించి స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారు. బాధితుడు ఇచ్చిన రూ. 10వేలు కాకుండా అతని వద్ద మరో రూ. 28వేలు వెరశి మొత్తం రూ. 38వేలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డిఎస్పీ గోపాలకృష్ణతో పాటు సిఐలు బి శ్రీనివాస్, కె వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్‌ఐగా పదోన్నతి పొందిన మహిళా కానిస్టేబుల్
పాతబస్తీ, మార్చి 26: పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని కొత్తపేట మహిళా కానిస్టేబుల్ ఎస్‌ఐగా ఎంపికైంది. ఇబ్రహీంపట్నం సమీపంలోని కిలీసుపురం గ్రామానికి చెందిన తాపిపని కార్మికుడు అంజయ్య, కోటేశ్వర మ్మ దంపతుల రెండో సంతానమైన ప ల్లా నాగ కళ్యాణి (27) బికాం కంప్యూటర్స్ చదివింది. పోలీసుశాఖపై అభిమానంతో ఎస్‌ఐ కావాలని 2012లో యత్నించగా 10 నెగిటివ్ మార్కులతో ఆమె అవకాశం చేజారింది. అయినాగాని 2013లో పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికై నాటి నుండి కొత్తపేట పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తుంది. యూనిఫారం ఒంటిమీదున్నాగాని ఆమెలోని పట్టుదల దూరంకాలేదు. ఈసారి పట్టుదలతో ఎస్‌ఐ పరీక్షలు రా సింది. అన్ని నెగ్గుకొచ్చి ఏలూరు రేంజి లో 12 స్థానం, విజయవాడ నగరంలో ఎమిదటి స్థానం సాధించింది. శుక్రవారం ప్రకటించిన ఎస్‌ఐ పోస్టుల ఫలితాల్లో నాగ కళ్యాణి విజయం సాధించ డం పట్ల కొత్తపేట సిఐ దుర్గారావు హ ర్షం ప్రకటించారు. ఈమెతోపాటు మా చవరం పోలీసు స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుల్ రేవతి కూడా ఎస్‌ఐగా నూతన విధులు నిర్వహించనున్నారు.