విజయవాడ

ప్రజాప్రతినిధులే దాడులు చేస్తే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 26: అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే ఎవరితో చెప్పుకోవాలో అర్థంకావడం లేదని రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రవాణా శాఖ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కలిసి ప్రైవేట్ బస్సులకు, వాహనాలకు ఇష్టారాజ్యంగా పర్మిట్లు ఇచ్చేస్తున్నారంటూ రవాణా శాఖాధికారులపై దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన చిలికిచిలికి గాలివానలా మారిన సంగతి తెలిసిందే. ఈవిషయంపై ఆర్టీసీ భవన్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్, నాన్ టెక్నికల్ డిపార్టుమెంట్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి మణికుమార్ మాట్లాడుతూ శనివారం జరిగిన వివాదంలో బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సోమవారం పెన్‌డౌన్‌తో నిరసన చేపడతామని చెప్పారు. రాష్ట్ర విభజనతో తమవంతుగా సేవలు అందించాలనే సదుద్దేశంతో ఎన్నో ప్రణాళికలు రూపొందించుకుని పని చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టేలా కార్యక్రమాలు చేపట్టడం వల్లనే దేశంలో నెంబర్ వన్ స్థానంలో రాష్ట్ర రవాణా శాఖ నిలిచిందన్నారు. దీంతో రాష్ట్రానికి 138 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులపై ప్రజాప్రతినిధులు ప్రవర్తించిన తీరును దారుణమని ఆయన ఖండించారు. ఒక ఐఎఎస్ అధికారితో పాటు ఆయన గన్‌మెన్‌పై ప్రజాప్రతినిధులు చేయిచేసుకోవడం చెప్పుకోడానికే సిగ్గుచేటని, ఈవిషయంలో బేషరతుగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రవాణా శాఖలోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సమైక్యంగా పెన్‌డౌన్‌తో నిరసన కార్యక్రమాలు చేపడతామని మణికుమార్ వివరించారు. సమావేశంలో జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎస్‌వి ప్రసాద్, గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కెవి సుబ్బారావు, ఆర్ సురేష్, డి శ్రీనివాస్, కె భద్రాచలం, తదితరులు పాల్గొన్నారు.