విజయవాడ

పార్టీ కమిటీలు ఏకగ్రీవం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 27: తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు ఏప్రిల్ 2 నుంచి 12వరకు జరుగుతాయని, సమర్థులైన నాయకులకు సముచిత స్థానం కల్పించాలని పార్టీ జిల్లా సమన్వయ కమిటీ తీర్మానించింది. జిల్లాలోని మండల, డివిజన్, మున్సిపల్ కమిటీల పార్టీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయ్యేందుకు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు కృషి చేయాలని సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. నగరంలోని జిల్లా టిడిపి కార్యాలయంలో సోమవారం జరిగిన సమన్వయ కమిటీకి మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు హాజరయ్యారు. మార్చి 29న జరిగే పార్టీ 36వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తం గా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రి పుల్లారావు సూచించారు. జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మండల పార్టీ ఎన్నికలకు తిరువూరు, నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలకు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ హిదాయత్, మానుకొండ శివప్రసాద్, గుడివాడ, కైకలూరు, పెడన నియోజకవర్గాలకు రాష్ట్ర పార్టీ కార్యదర్శి డొక్కా జగన్నాథం, రాష్ట్ర పార్టీ మాజీ కార్యదర్శి వెన్నా సాంబశివరెడ్డి, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలకు రాష్ట్ర పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి మెంటే పార్థసారథి, రాష్ట్ర తెలుగు మహిళా నాయకురాలు ఎం సత్యవాణి, పెనమలూరు, విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాలకు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్, మహిళా నాయకురాలు పానకాల వెంకట మహాలక్ష్మీ, విజయవాడ పశ్చిమ, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు రాష్ట్ర పార్టీ కార్యదర్శి యర్రాకుల శ్రీనివాసరావు, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ వజీర్, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ వట్టికూటి హర్షవర్థనరావును రాష్ట్ర పార్టీ నియమించిందని వారితో సమన్వయం చసుకుని ఎన్నికలను నిర్వహించాలని కోరారు. కాగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బిసి, కాపు కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే సబ్సిడి రుణాలకు లబ్ధిదారులను ముందుగా మండల పరిషత్ అధికారులు నిర్ణయించడంతో కొన్ని చోట్ల అందుకు బ్యాంకులు అంగీకరించడం లేదని, అవసరమైతే లబ్ధిదారులను వేరే బ్యాంకులకు మార్చుకోవడానికి ఎంపిడిఓలకు అధికారం ఇవ్వాలని కొందరు కోరగా వెంటనే ఆ విషయమై లీడ్ బ్యాంకు మేనేజర్‌తో ఫోన్‌లో సంప్రదించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మంత్రి ఉమ ఆదేశించారు. సమావేశానికి ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షత వహించగా మంత్రులు దేవినేని ఉమాహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు, గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీమోహన్, బోడేప్రసాద్, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు జయమంగళ వెంకటరమణ, రావి వెంకటేశ్వరరావు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, నల్లగట్ల స్వామిదాసు, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, శాప్ డైరెక్టర్ బండారు హనుమంతరావు, రాష్ట్ర అపెక్స్ కమిటీ మెంబర్ ఆళ్ళ గోపాలకృష్ణ, ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు గుత్తా శివరామకృష్ణ, యనమద్ది పుల్లయ్య చౌదరి పాల్గొన్నారు.

పిసిసి కార్యదర్శిగా కొరగంజి భాను
ఇంద్రకీలాద్రి, మార్చి 27: పాతబస్తీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొరగంజి భాను పిసిసి కార్యదర్శిగా నియమితులయ్యారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ కోసం వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించటంతో పాటు ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు అభ్యర్థుల గెలు పు కోసం విశేష కృషి చేసినందుకు పార్టీ అధిష్ఠానం భానుకు ఈ బాధ్యతలు అప్పగించింది. సోమవారం ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భానుకు నియామక ఉత్తర్వులను పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అందజేశారు. ఈసందర్భంగా భాను మాట్లాడుతూ తన నియామకానికి విశేష కృషి చేసిన కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతలతో పార్టీకి పూర్తిస్థాయి సేవలు అందించేందుకు కృషి చేస్తానని భాను వివరించారు.