విజయవాడ

పన్నుల వసూలుకు కుస్తీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 27: విజయవాడ నగరపాలక సంస్థలో నూరు శాతం పన్ను వసూలు చేయాలన్న విఎంసి కమిషనర్ వీరపాండియన్ టార్గెట్‌కు ఇక మూడే మూడు రోజులు మిగిలి ఉన్నాయి. పన్ను వసూలులో ఎప్పుడూ వెనకబడి ఉండే విఎంసిని ఈ సంవత్సరం నూరు శాతం వసూలు చేయాలన్న కమిషనర్ ఆలోచనలు ఎంతవరకు సఫలీకృతమవుతాయన్నది 31వ తేదీనాటికి తేలనున్నది. నూరు శాతం వసూలు అన్నది సాధ్యకాని పరిస్థితి కాబట్టి గత సంవత్సరం కన్నా మరింత ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయాలన్న సిబ్బంది ఆలోచనగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇదిలావుండగా సాధారణ ప్రజల నుంచి వసూలయ్యే పన్ను ఎలాగైనా వస్తుంది, కానీ దీర్ఘకాలిక బకాయిలు, కోర్టు వివాద కేసుల్లో ఉన్న పన్ను మొత్తంతో పాటు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన పన్ను బకాయిల వసూలు విషయంలో ఇప్పటికే చేతులెత్తేసిన విఎంసి అధికారులు తమ ప్రతాపం మొత్తాన్ని సామాన్యులపైనే చూపిస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. విఎంసి ఖజానాకు జమకావాల్సిన పన్ను మొత్తాలను పరిశీలిస్తే సుమారుగా ఆస్తి పన్ను 163 కోట్లు, ఖాళీ స్థలాల పన్ను 78 కోట్లు, వృత్తి పన్ను 13 కోట్లు, నీటి పన్ను 29కోట్లు, సీవరేజ్ పన్ను 10 కోట్లు, నీటి మీటర్ల పన్ను 18 కోట్లు, డి అండ్ ఓ లైసెన్స్ ఫీజు మొత్త 11 కోట్లు, ఇతర విభాగాల నుంచి 157 కోట్లుగా ఉంది. ఇప్పటివరకూ వసూలైన మొత్తాలను పరిశీలిస్తే ఆస్తిపన్ను సుమారు 80 కోట్లు, సీవరేజ్ 8 కోట్లు, నీటి పన్ను 21 కోట్లు, ఖాళీ స్థలాల పన్ను 10 కోట్లుగా ఉన్నట్టు సమాచారం. ఖాళీ స్థలాల యజమానుల అడ్రస్‌లు సరిగా దొరకకపోవడంతో వాటి వసూలు సాధ్యం కావడం లేదన్న విషయం గత మూడు సంవత్సరాలుగా అధికార, సిబ్బంది వినిపిస్తున్న మాట. బకాయిలు 78 కోట్లుగా ఉంటే వసూలు మాత్రం 10 కోట్లుగానే ఉంటోంది. ప్రతి సంవత్సరం ఇదే మాట చెప్పి నెట్టుకొస్తున్న అధికారులు ఖాళీ స్థల పన్ను వసూలు ప్రక్రియలో కావాలనే అలక్ష్యం, యజమానులతో లాలూచి పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా వివిధ అంశాల్లో జాతీయ స్థాయి గుర్తింపు అవార్డులు పొందిన విఎంసి పన్ను వసూలు లో మాత్రం ఘోరంగా వెనకబడిందనే చెప్పాలి. తమ అధికార ప్రతాపాన్ని సామాన్యుల పైనే చూపిస్తున్న విఎంసి అధికారులు బడా బాబుల జోలికి మాత్రం వెళ్ళిన దాఖలాలు కనిపించడం లేదు. పన్ను చెల్లింపులలో జాప్యం వహించారన్న నెపంతో ఇప్పటికే వందలాది ఇళ్లకు చెందిన నీటి కనెక్షన్లను కట్ చేసిన విషయం అధికారికంగానే తెలుస్తోంది. కమిషనర్ మెప్పుకోసం కొంత మంది రెవెన్యూ బిల్ కలెక్టర్లు, ఆర్‌ఐ పలువురు తాము కట్ చేసిన నీటి కనెక్షన్ల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తున్న విషయం గమనార్హం. ఇదిలావుండగా విఎంసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేసే పెండింగ్ టాక్స్ పేయర్స్ లిస్టుకు వాస్తవ జాబితాకు ఎంతో తేడా కనిపిస్తుంది. ఇటీవల గత కొద్ది రోజుల క్రితం పెండింగ్ ట్యాక్స్ పేయర్స్ జాబితాలో నగరానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పేర్లు కనిపించడమే కాకుండా వారు చెల్లించాల్సిన లక్షలాది రూపాయల బకాయిలపై రాద్దాంతం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వీరి చెల్లింపుల పరిస్థితి ఏమిటన్నది పక్కనపెడితే ప్రస్తుతం ఆస్తిపన్ను మొత్తం 168 కోట్లలో కనీసం 100 కోట్లనైనా వసూలు చేసి కమిషనర్ వీరపాండియన్‌ను శాంతింప చేద్దామనే విషయంపై విఎంసి రెవెన్యూలో విభాగంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా ప్రస్తుతం పనిచేస్తున్న 59 మంది బిల్‌కలెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, అసిస్టెంట్ కమిషనర్లకు విధించిన టార్గెట్ ప్రకారం వసూలు చేయకపోతే శాఖాపరమైన చర్యలు ఎదుర్కొనక తప్పదంటూ కమిషనర్ హెచ్చరించిన నేపథ్యంలో రాబోయే మూడు రోజుల తరువాత కమిషనర్ తీసుకునే చర్యలపై రెవెన్యూ అధికారుల్లో కలకలం మొదలైంది.

11వ డివిజన్ కార్పొరేటర్‌గా
వీరంకి కృష్ణకుమారి ఏకగ్రీవం
పటమట, మార్చి 27: పటమటలోని 11వ డివిజన్ టిడిపి కార్పొరేటర్‌గా వీరంకి కృష్ణకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014 విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 11వ డివిజన్ నుండి టిడిపి కార్పొరేటర్‌గా ఎన్నికైన డాంగేకుమార్ అకాల మరణం చెందిన నేపథ్యంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ ప్రకియలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ నామినేషన్ వేయకపోవటంతో ఆమె ఎన్నిక ఏగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ఆర్ విక్టర్ సోమవారం ప్రకటించారు. ఈమేరకు వీరంకి కృష్ణకుమారి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి ధృవీకరణ పత్రం అందుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త వీరంకి డాంగేకుమార్ ఆశయాలను ముందుకుతీసుకెళుతూ, ఆయన స్ఫూర్తితో 11వ డివిజన్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తను ఏగ్రీవంగా ఎన్నిక కావటానికి పూర్తిగా సహకరించిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామమోహన్, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, తదితర టిడిపి నేతలకు, కార్యకర్తలకు, ఇతర పార్టీల నేతలందరికీ, డివిజన్ ప్రజలకు, డాంగే అభిమానులకు కృష్ణకుమారి కృతజ్ఞతలు తెలిపారు.