విజయవాడ

దేశానికే ఆదర్శం జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 27: కృష్ణా జిల్లాలో ఆధార్ ఆధారిత అనుసంధానంతో అమలు జరుగుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ శాఖ సెక్రటరీ ప్రీతి సుడాన్ చెప్పారు. జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్న ఎఇపిడిఎస్ విధానాన్ని ఆమె సోమవారం విజయవాడ రూరల్ భవానీపురంలో చౌకధర దుకాణం నెం.4లో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ప్రీతి సుడాన్ మాట్లాడుతూ జిల్లాలో అమలు జరుగుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా గుర్తింపు తెచ్చిందన్నారు. ఇటీవల జిల్లా అంతర్జాతీయ పురస్కారంతో గుర్తింపు పొందిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఎఇపిడిఎస్ విధానాన్ని దేశవ్యాప్తంగా జూన్ మాసాంతానికి అన్ని రాష్ట్రాల్లో అమలుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో నగదు రహిత లావాదేవీల నిర్వహణకై జిల్లాలో ఆధునీకరించిన ఎఇపిడిఎస్ లక్షలాది మంది వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలు అందిస్తుందన్నారు. జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థలో 75 శాతానికి పైగా లబ్ధిదారులు నగదు రహితంగా లావాదేవీలు నిర్వహించి రేషన్ పొందడం విశేషమన్నారు.
ఎఇపిడిఎస్ విధానం భేష్
విజయవాడ భవానీపురంలో రేషన్ షాపు నెం.4లో ఐడిఎఫ్‌సి బ్యాంకు ఎఇపిడిఎస్ మైక్రో ఎటిఎం ద్వారా 15 రూపాయలు నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన కార్డుదారుడు గురజాడ గోపాలకృష్ణ శర్మ 15 కిలోల రేషన్ బియ్యం పొందడం ప్రత్యక్షంగా పరిశీలించి ఈ విధానం చాలా బాగుందని ప్రీతి సుడాన్ కితాబిచ్చారు. అలాగే ఇదే విధానం ద్వారా కార్డుదారుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నుండి తన వేలిముద్రను వినియోగించి 50 రూపాయలు నగదును విత్‌డ్రాయల్ చేసుకోవడాన్ని ప్రీతి సుడాన్ పరిశీలించారు. జిల్లాలో అమలు జరుగుతున్న ఎఇపిడిఎస్ విధానాన్ని జిల్లా కలెక్టర్ బాబు.ఎ వివరిస్తూ ఆధార్ అనుసంధానంతో అమలు జరుగుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థకు అంతర్జాతీయ పురస్కారానికి గుర్తింపు వచ్చిందన్నారు. జిల్లాలో 2265 చౌకధరల దుకాణాల్లో 12 లక్షల 36వేల మంది రేషన్ కార్డుల లబ్దిదారులకు ఈ విధానం ద్వారా నిత్యావసర వస్తువులను అందిస్తున్నామన్నారు. మైక్రో ఎటిఎంలో వేలిముద్ర వేసేటప్పుడు లబ్ధిదారునికి సాంకేతికపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదురైతే ఐరిష్ ద్వారా గుర్తించే ఏర్పాటు చేసామని కలెక్టర్ వివరించారు. ఎఇపిడిఎస్ పద్ధతి ద్వారా ప్రతినెలా ప్రభుత్వానికి సుమారు 6 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని వివరించారు. చౌకధరల దుకాణాల డీలర్లు మినీ బ్యాంకర్లుగా వ్యవహరిస్తూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రతి లబ్దిదారునికి పారదర్శకంగా సరుకులు అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిధన్ యోజన కింద నిర్వహించే లక్కీగ్రాహక్ కింద కృష్ణాజిల్లాలో 13269 మందికి బహుమతులు లభించాయని వివరించారు. వీరిలో 5వేల మందికి వెయ్యి రూపాయల నుండి లక్ష రూపాయల వరకు బహుమతులు లభించాయన్నారు. దేశంలోనే కృష్ణాజిల్లాలో అన్ని స్థాయిల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం ద్వారా ప్రథమ స్థానంలో ఉన్నామని వివరించారు.