విజయవాడ

మాజీ సైనిక కుటుంబాలను ఆదుకోవం అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, మార్చి 30: దేశరక్షణ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విశేష సేవలు అందించిన మాజీ సైనికుల కుటుంబాలకు తగు విధంగా సహాయ సహకారాలను అందించడం అభినందనీయమని రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ డైరెక్టర్ కమాడోర్ యంవియస్ కుమార్ అన్నారు. స్థానిక కరెన్సీనగర్‌లోని మాజీ సైనికుల సంక్షేమ జిల్లా కార్యాలయంలో గురువారం మాజీ సైనిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేశారు. కల్నల్ యంటి.స్వామి అధ్యక్షతన బాధితుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా సైనికబోర్డు చేస్తున్న సేవలు యువ ఎన్‌సిసి కేడెట్లు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలో మాజీ సైనికుల సంక్షేమానికి అందరూ ఒక తాటిపైకి రావాలన్నారు. ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలను వారికి చేరే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్‌సిసి గ్రూప్ కమాండర్, కాకినాడ కల్నల్ ఎల్‌సిఎస్ నాయుడు మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబాలకు సహకారం అందించడం ఉద్యోగులుగా తమ ప్రథమ కార్తవ్యమని, కృష్ణాజిల్లాలో ప్రథమంగా ఈ విధమైన కార్యక్రమం జరగడం గర్వకారణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. అంతకుముందు జిల్లా మాజీ సైనిక ఉద్యోగులు జిల్లా సైనిక సంక్షేమ అధికారి వివి. రాజారావుకు కార్యాలయానికి అఫీసు పర్నిచర్ నిమిత్తం 40 వేలు, ముగ్గురు మాజీ సైనిక కుటుంబాలకు ఒక్కొక్కరికి 5వేలు చొప్పున అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షలు, ఉపాధ్యక్షులు ముమ్మనేని గోపాలకృష్ణ, పి.రాజేంద్రప్రసాద్, కార్యదర్శి డాక్టర్ అబ్దుల్ ఖాలీల్, కోశాధికారి టి.రమేష్ పలువురు ఎన్‌సిసి కేడెట్లు పాల్గొన్నారు.

పోక్సో కేసులో ఇద్దరికి జైలు, జరిమానా
విజయవాడ (క్రైం), మార్చి 30: ప్రేమ పేరుతో మైనర్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడితో పాటు సహకరించిన స్నేహితునికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ పోక్సో చట్టం ప్రత్యేక కోర్టు ఏసిబి న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా బందరు మండలం ఎస్‌ఎన్ గొల్లపాలెం గ్రామానికి చెందిన వాకా నాగేశ్వరరావు(24) ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా సమీప గ్రామం సీతారాంపురానికి చెందిన ఓ మైనర్ విద్యార్థిని ప్రేమపేరుతో వెంటపడుతూ ఉండేవాడు. సదరు విద్యార్థిని కానూరులోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. ఈక్రమంలో బాలిక 2014 మే 31న సీనియర్ ఇంటర్ ఆఖరి పరీక్ష రాసింది. అదేరోజు వాకా నాగేశ్వరరావు తన స్నేహితుడైన హైదరాబాద్ నివాసి గొల్లప్రోలు మధుబాబును వెంట పెట్టుకుని కారులో హాస్టల్ వద్దకు వచ్చి విద్యార్థిని ఎక్కించుకుని నేరుగా వాకా నాగేశ్వరరావు ఇంటికి తీసుకెళ్లారు. ఆరోజు రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు హైదరాబాద్ తీసుకెళ్లి లింగంపల్లి గ్రామంలో గది తీసుకుని ఆమెపై లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఇంటికి రాకపోయేసరికి విద్యార్థిని తండ్రి 2014 జూన్ 2న పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికతో సహా నిందితులిద్దరిని గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా విచారణలో 13మంది సాక్షులను విచారించగా మైనర్‌పై కిడ్నాప్, అత్యాచారం కేసుల కింద నేరం రుజువైంది. దీంతో వాకా నాగేశ్వరరావుకు పదేళ్ల జైలు, రూ.4వేలు జరిమానా, సహకరించిన స్నేహితుడు మధుబాబుకు ఏడేళ్ల జైలు, రూ.2వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.