విజయవాడ

విఎంసి పన్నులు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 30: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు అయిన మార్చి 31లోగా నగర ప్రజలు విఎంసి చెల్లించాల్సిన ఆస్తి, నీటి, యుజిడి, వృత్తి తదితర పన్నులను చెల్లించాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో పన్నులు చెల్లించకుంటే బకాయిల జాబితాలో చేరి 2శాతం ఫైన్ విధించే అవకాశం ఉన్నందున ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. పన్ను చెల్లింపులకు నగరంలోని ప్రధాన కార్యాలయాలతోపాటు సర్కిల్ కార్యాలయాలలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా కూడా చెల్లించే అవకాశం ఉన్నందున 31న అర్ధరాత్రి 12 గంటలలోపు తమ చెల్లింపులను ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు.

పాత విద్యుత్ బకాయిలకు వడ్డీ మాఫీ చేయాలి
* అఖిల భారత పంచాయతీ పరిషత్ డిమాండ్

విజయవాడ, మార్చి 30: మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం పూర్తిగా సిద్ధించాలంటే గ్రామ పంచాయతీలకు రాజ్యాంగం కల్పించిన 29 విశేష అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు డిమాండ్ చేశారు. దేశానికి పల్లెలు పట్టుకొమ్మలాంటివని, దేశవ్యాప్తంగా 72 శాతం జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్నారన్నారు. రాష్టవ్య్రాప్తంగా 13వేల గ్రామ పంచాయతీలుంటే గత జనవరి మాసాంతానికి రూ.1100 కోట్లు పైగా ఉన్న విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ సంస్థ పంచాయతీలకు నోటీసులు పంపించిందని తెలిపారు. గత పాలకుల హయాం నుంచి అంటే 2004 నుంచి ఈ బకాయిలు కొనసాగుతుంటే తాజాగా వడ్డీ, తిరిగి దానిపై అపరాధ వడ్డీ విధించారన్నారు. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు ఇంత మొత్తాలను చెల్లించే స్థితిలో లేనందున కనీసం వడ్డీ, అపరాధ వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ జాస్తి వీరాంజనేయులు గురువారం సచివాలయంలో పంచాయతీ శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తాజాగా గుంటూరు జిల్లాలో సర్పంచ్‌ల చెక్‌పవర్‌ను తక్కువ చేస్తూ ఆ చెక్‌లపై పిఆర్‌డి ఇవో కౌంటర్ సంతకం ఉండాలంటూ ఆదేశాల జారీ చేయటం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టేనన్నారు. దీన్ని జిల్లా సర్పంచ్‌ల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ కొత్త విధానంలో ఇఓలు సర్పంచ్‌ల నుంచి కమీషన్‌లు ఆశిస్తున్నారంటూ జాస్తి ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు సక్రమంగా రావటంలేదంటూ సర్పంచ్, ఎంపిటిసి, ఎంపిపి, జెడ్పీటిసి, జెడ్పీ చైర్మన్‌లకు ప్రతినెల 5వ తేదీకల్లా ట్రెజరీల్లో జమ అయ్యేట్లు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. గ్రామాల్లో లక్షల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయని, చట్టప్రకారం ఒక్క స్తంభానికి ఏటా రూ. 50లు, ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ. 7వేలు పన్నును పంచాయతీలే విద్యుత్ శాఖ నుంచి వసూలు చేయాల్సి ఉందన్నారు. అసలు ఈ లెక్కన పంచాయతీలకే విద్యుత్ సంస్థలు కోట్లలో బాకీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన వసూలు చేయాలని కోరారు. సిఆర్‌డిఎ పరిధిలోని పంచాయతీలకు గతంలో ఇళ్ల ప్లాన్‌లు ఇచ్చే అధికారం ఉండేదని, ప్రస్తుతం ఆ అధికారం సిఆర్‌డిఎకు వెళ్లిందన్నారు. కనీసం, 200 లేదా 100 గజాల లోపు చిన్న ఇళ్లకు ప్లాన్‌లు ఇచ్చే అధికారం ఇవ్వాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలపై కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌ల పేర్లు ఉండటం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఇదే సందర్భంగా వీరాంజనేయులు సిఎం కార్యాలయంలో అధికారులకు కూడా ఈమేరకు వినతిపత్రం అందించారు. ఆయన వెంట గుంటూరు జిల్లా సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ సంధాని, జిల్లా ఎస్సీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలు మనె్నల సుజాత కిషోర్, పలువురు సర్పంచ్‌లు ఉన్నారు.