విజయవాడ

నూతన చట్టంతో.. డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 30: రాష్ట్రంలో డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పడనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువగా చోటుచేసుకొంటున్న డబుల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎంతో మంది అభాగ్యులు తమ ఇళ్లు, పొలాలు, స్థలాలను కోల్పోతున్న వైనాన్ని సీరియస్‌గా తీసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలను నిలువరించేందుకు నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రం మొత్తం వర్తింపజేసే విధంగా రిజిస్ట్రీకరణ చట్టం 1908ని సవరించి రిజిస్ట్రీకరణ చట్టము- 2016ను అమలులోకి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా గురువారం జరిగిన శాసన మండలిలో ఆమోదింపచేసింది. ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి కె ఇ కృష్ణమూర్తి ప్రవేశపెట్టిన ఈ బిల్లును మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చట్టంలోని ప్రధాన అంశాలను పరిశీలిస్తే స్థిరాస్తి, బదిలీ దస్తావేజు విషయాల్లో మోసం, దొంగ రాత లేక సంతకం (్ఫర్జరీ) నుంచి రక్షించడానికి సంబంధించి లావాదేవీల విషయంలో క్రమపద్ధతి, క్రమశిక్షణ, బహిరంగ నోటీసులను ఏర్పాటు చేయు ఉద్దేశంతో రిజిస్ట్రీకరణ చట్టాన్ని చేయడం జరిగింది. స్థిరాస్తికి సంబంధించిన లావాదేవీలలో దస్తావేజు పోగొట్టుకున్న లేదా ధ్వంసం అయినప్పటికీ వాటికి రిజిస్ట్రీకరణ రక్షణ, భద్రతలను కల్పిస్తోంది. రిజిస్ట్రేషన్ చట్టంలోని పలు లోపాల వలన అస్తులను విక్రయించడం ద్వారా అమాయకపు ప్రజలు మోసం చేయాలన్న ఉద్దేశం ఒకే ఆస్తిని ఒకసారి కాకుండా పలు పర్యాయాలు వేర్వేరు కొనుగోలుదారులకు విక్రయించే వంటి అనైతిక పద్ధతులకు చెక్ పెడుతూ ఈచట్టం డబుల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నివారించగలదని మంత్రి కెఇ కృష్ణమూర్తి బిల్ ప్రవేశపెడుతూ పేర్కొనగా చైర్మన్ చక్రపాణి సభ్యుల ఆమోదం కోరగా సభలో ఉన్న మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు.

లోకమాతకు కోటి పుష్పార్చన
ఇంద్రకీలాద్రి, మార్చి 30: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు గురువారం ఉదయం మరువం, మల్లెలు, చామంతులు, మందార పువ్వులతో అర్చకులు వైభవంగా కోటి పుష్పార్చన నిర్వహించారు. దుర్గమ్మ సన్నిధిలో ప్రారంభమైన వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజున దుర్గమ్మకు ఈ పుష్పార్చన నిర్వహించారు. ఇవో సూర్యకుమారి ఆదేశాలతో శ్రీ మల్లిఖార్జున మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవ మూర్తిని ఉంచారు. ముత్తయిదువులు పుష్పాలను ఊరేగింపుగా కొండమీద ఓం టర్నింగ్ పాయింట్ వద్ద నుండి తీసుకువస్తుండగా ముందు భాగంలో కళాకారులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. మల్లిఖార్జున మహామండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ముందు ఉభయదాతలు కూర్చోబెట్టి పుష్పార్చన చేశారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సతీమణి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.