విజయవాడ

తండ్రి అసెంబ్లీలో, తనయుడు మండలిలో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 30: నూతన రాజధానిలో తండ్రి అసెంబ్లీలో, తనయుడు మండలిలో ఉండటంతో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో నూతన శకంలోకి అడుగుపెట్టనుందని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. లోకేష్ శాసన మండలిలోకి అడుగుపెట్టడంతోనే మండలికే కళవచ్చిందని ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. మొదటిసారిగా ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా అల్లుడిని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆప్యాయంగా హత్తుకున్నారు. లోకేష్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏపి, తెలంగాణకు చెందిన తెదేపా శ్రేణులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్సీల ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం శాసనమండలితో పాటు బిఎసి హాల్‌లో నిర్వహించారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, తెదేపా నేతలు, కార్యకర్తలు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ముందుగా అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్‌లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీగా లోకేష్ ప్రమాణస్వీకారం మండలి స్పీకర్ ఛాంబర్‌లో చేయగా ఆయన అభినందనలు తెలిపేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దఎత్తున మండలి భవనం వద్దకు చేరుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం లోకేష్‌తో పాటు తెదేపా ఎమ్మెల్సీలకు అందరూ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు అభినందనలు తెలిపారు. లోకేష్‌తో పాటు ప్రమాణస్వీకారం చేసిన మిగతా ఎమ్మెల్సీలను అసెంబ్లీ సిబ్బంది సైతం అభినందించారు. అనంతరం కొత్తగా శాశన మండలికి ఎన్నికైన సభ్యులు లోకేష్, కరణం బలరామ్, పోతుల సునీత, డొక్కా మణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునుడులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన ఛాంబర్‌లో కలుసుకొన్నారు. ఎమ్మెల్సీలను అభినందించిన బాబు, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనుభవానికి, యువతరానికి మేలుకలయికగా ఉన్న కొత్త శాశనమండలి సభ్యులు ప్రజాసమస్యలను సభ దృష్టికి తీసుకురావడంలో చురుగ్గా వ్యవహరించాలన్నారు. ప్రజల సమస్యలు ప్రతిబింబించే విధంగా ప్రతి సభ్యుడు పనిచేయాలని, ఆ సమస్యలను మాట్లాడుతున్నారన్న భావన ప్రజల్లో కలుగజేయాలని సభ్యులందరూ శాసన మండలి నియమావళిని పాటించాలని మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. అసెంబ్లీకి గురువారం వచ్చిన తెలంగాణ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య.. ఎపి ఎమ్మెల్యేలతో కొద్దిసేపు చిట్‌చాట్ చేసారు. అసెంబ్లీ సస్పెన్షన్ అంశంలో తనకు రోజా అంశానికి అసలు సంబంధంలేదన్న రేవంత్‌రెడ్డి, అకారణంగా కక్ష గట్టి కేసిఆర్ నన్ను సస్పెండ్ చేశారన్న ఆయన రోజా సస్పెన్షన్ ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. సభలో మేం మాట్లాడకున్నా మమ్మల్ని బయటకు పంపుతున్నారన్న రేవంత్‌రెడ్డి, మీరు ప్రతిపక్షం విషయంలో చాలా ఓపిగ్గా ఉంటున్నారని తెలిపారు. నిజమే స్పీకర్ నెత్తిమీద ప్రతిపక్షం ప్లకార్డులు పెడుతున్నా ఓపిగ్గా వ్యవహరిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలంగాణసభలో తెదేపా ఎమ్మెల్యేల పరిస్థితిని ఇక్కడ సభలో ప్రస్తావించండంటూ గోరంట్లకు రేవంత్ సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోని ప్రభుత్వం అనుకూలురు...వ్యతిరేకుల విషయంలోనూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం తలోరకంగా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కేసిఆర్ చూపిన మార్గంలో వెళ్తేతప్ప ఏపిలో ప్రతిపక్షం దారికొచ్చేట్లు లేదని గోరంట్ల అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార సందడి కోలాహలంగా సాగింది. గురువారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రుల కలయకతో మండలి ప్రాంగణం కళకళలాడింది.