విజయవాడ

విఎంసి ఖజానా ఆదాయం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 3: నగర ప్రజలు విఎంసికి చెల్లించాల్సిన అన్ని పన్నులను వసూలు చేయడంతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన రీయంబర్స్‌మెంట్ నిధుల విడుదలకు సత్వరమై చర్యలు తీసుకోవాలని విఎంసి సిటీప్లానర్ వి శ్రీనివాసరావు, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ జి సుబ్బారావులను నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ ఆదేశించారు. సోమవారం కౌన్సిల్ భవనంలోని తన ఛాంబర్‌లో వారితో నిర్వహించిన సమీక్షలో శ్రీ్ధర్ మాట్లాడుతూ గత ఆర్ధిక సంవత్సరం 2016-17లో ప్రజలు చెల్లించాల్సిన ఆస్తి, నీటి, ఖాళీ స్థలాలు, యుజిడి, తదితర పన్నుల వసూలులో టార్గెట్‌ను చేరుకోకపోవడమే కాకుండా సాధారణ వసూలుకన్నా తక్కువగా వసూలు చేసిన వైనంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన విఎంసి ఖజానాకు ఆదాయం చేకూర్చే పన్ను వసూళ్లలో ఎటువంటి లోపాలు లేకుండా బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. జక్కంపూడి లోని వైఎస్‌ఆర్ కాలనీకి గత ఐదేళ్లుగా నీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు విఎంసి తరఫున అందిస్తున్నా అక్కడ నుంచి పైసా పన్ను వసూలు చేయకపోవడంతో విఎంసి ఖజానాపై భారం అధికమవుతోందన్నారు. ఆయా వసతుల కల్పనలకు సంవత్సరానికి పది లక్షలకుపైగా ఖర్చవుతుండగా పది వేల రూపాయలైన పన్ను వసూలుచేయకపోవడం పై శోచనీయమన్నారు. జక్కంపూడి పంచాయితీ తీర్మానాలను ప్రభుత్వానికి పంపించి అక్కడ విఎంసి పన్నులు వసూలుచేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రోడ్ల విస్తరణకు స్థలాలిచ్చిన యజమానులకు అందించిన నష్టపరిహార నిధులు 17 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి రీఎంబర్స్‌మెంట్ అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సిటీ ప్లానర్ శ్రీనివాసులకు సూచించారు. ఈ సమీక్షలో కార్పొరేటర్లు వి హరనాధస్వామి, ఉమ్మడి వెంకటేశ్వరరావు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

ఒప్పంద కార్మికుల కృషితో సత్ఫలితాలు
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 3: థర్మల్ విద్యుత్ కేంద్రం పరిపాలన భవనం సమావేశ మందిరంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పాదనలో సాధించిన విజయాల పట్ల సోమవారం సమీక్ష సమావేశం జరిగింది. జనరల్ మేనేజర్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో చీఫ్ ఇంజనీర్ పద్మసుజాత మాట్లాడుతూ ఈ కేంద్రంలో 3, 4 యూనిట్లు వరుసగా మూడు సంవత్సరాలు ప్రథమ స్థానంలో నిలిచాయని చెప్పారు. మంచిపని, జట్టుత్వం, ఒప్పంద కార్మికుల కృషి ఫలితంగా మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల కన్నా ఎపి జెన్కో మిన్నగా నిలిచిందని తెలిపారు. 3వ యూనిట్ ప్రథమ స్థానంలో 80.86 పాయింట్లతో ఫ్యాక్టరీ 1487.51 మిలియన్ యూనిట్స్, 7వ యూనిట్ ద్వితీయ స్థానం 80.85 శాతం లోడ్ ఫ్యాక్టర్ 3541.27 మిలియన్‌ల యూనిట్స్, ఆరవ యూనిట్ తృతీయ స్థానంలో 78.09 శాతం లోడు ఫ్యాక్టర్ 1436.57 మిలియన్‌ల యూనిట్స్ సెపిపిక్ ఆయిల్ వినియోగం ఎంతో గణనీయంగా 865 నుండి 645 మిల్లి కిలోవాట్స్ తగ్గిందని వివరించారు. సమావేశంలో నవీన గౌతమ్, రమేష్‌బాబు, గౌరీపతి, మురళీకృష్ణ, కళ్యాణ్‌కుమార్, భాస్కర్, ఇంజనీర్లు, కార్మికులు, ఒప్పంద కార్మికులు పాల్గొన్నారు.