విజయవాడ

కూలీలకు తప్పనిసరిగా ఉపాధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 3: ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించాల్సిన బాధ్యత మండలస్థాయి అధికారులకు ఉందని, లక్ష్యాల సాధించని సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవడం జరగుతుందని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు క్షేత్రస్థాయి అధికారులకు తెలిపారు. సోమవారం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయపు వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లాలోని ఎంపిడివోలు, తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం సజావుగా జరుగుతున్నందున దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి స్థితిగతలు మెరుగుపడినట్లు నీతి ఆయోగ్ నివేదికలు ద్వారా తెలుస్తున్నాయన్నారు. పథకం యొక్క ముఖ్యోద్దేశం అమలుపర్చి క్షేత్రస్థాయిలో ఉపాధి కూలీలకు పనులు కల్పించే విధంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ పథకంలో కూలీలు పనిచేస్తే వేతనం చెల్లిస్తారని, అదే విధంగా మెటీరియల్ కాంపౌండ్ ద్వారా పనిచేసే పనులు వలన గ్రామాభివృద్ధి జరుగుతుందని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు వివరించారు. పథకంలో లబ్దిదారులకు సకాలంలో వేతనాలు చెల్లించే అవకాశం ఉన్నందున జిల్లాలో పనులు పెద్దఎత్తున జరిగే విధంగా చూడాలని స్పెషల్ ఆఫీసర్లు చూడాలని ఆదేశించారు.
వేసవిలో ఎండ తీవ్రతను ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఉపాధిహామీ కూలీలకు, అంగన్‌వాడీ కేంద్రాల్లో, ఆశా వర్కర్లు వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉండాలన్నారు. ఎండకాలంలో వడ గాల్పులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన అన్ని ముందుస్తు జాగ్రత్తలు అమలు జరుగుతున్నది లేనిదీ అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు. జూన్ 2నాటికి జిల్లాను పొగ రహిత జిల్లాగా ప్రకటించే దిశగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను అర్హులైన వారందరికీ ఇచ్చే విధంగా అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. దీని కోసం ప్రజాపాధికార సర్వే రిపోర్టును ప్రమాణికంగా తీసుకొని లబ్దిదారులను గుర్తించి వారికి గ్యాస్ కనెక్షన్లు నిర్దేశించిన గడువులోపుల ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో డిఆర్‌డిఎ పీడీ డి చంద్రశేఖరరాజు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ సూర్యనారాయణ, డిఎస్‌ఓ జి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.