విజయవాడ

రానున్న రెండేళ్లు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 4: ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ప్రగతిపథంలో నడిపిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాల్వ శ్రీనివాసులు మొదటిసారిగా సచివాలయం బ్లాక్ 1లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. అనుకోని విధంగా తెలుగుజాతి రాష్ట్రం రెండు ముక్కలు అయ్యిందని, రాష్ట్రానికి గుండెకాయ అయిన హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిందన్నారు. రానున్న రెండేళ్లు అత్యంత కీలకం కాబట్టి వేగంగా రాష్ట్రంలో అభివృద్ధి చేయటానికి ప్రణాళికాబద్ధంగా పని చేస్తామన్నారు. రాష్ట్భ్రావృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచి చేపడుతున్న కార్యక్రమాలను అర్థమయ్యే రీతిగా ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఇందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. తాను జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి, 14 సంవత్సరాలు జర్నలిస్ట్‌గా పని చేశానన్నారు. తాను జర్నలిస్ట్ కుటుంబంలో సభ్యుడినేనన్నారు. పాత్రికేయులు సమాజంలో ఒక భాగమని, ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకమైందన్నారు. అలాగే లోటుపాట్లను ఎప్పటికప్పుడు ఎత్తి చూపాలని, అది వృత్తి ధర్మమన్నారు. పాత్రికేయ వృత్తి పవిత్రమైనదని, బాధ్యతాయుతమైనదని మంత్రి పేర్కొన్నారు. విలేఖర్ల వృత్త్ధిర్మంలో ఏమైనా పొరపాట్లు జరిగితే దాని ప్రభావం ప్రజలు, వ్యక్తులు, ప్రభుత్వం, అధికారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. పాత్రికేయ విధి నిర్వహణలో ప్రభుత్వ సమాచారం గురించిగానీ, వృత్తిపరమైన సమస్యగానీ ఎదురైతే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించటానికి తనవంతు కృషి చేస్తానన్నారు.
ఫిరాయింపులపై చర్చ జరగాలి
ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిర్యాయింపులపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని విలేఖర్లు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ ఫిరాయింపులు ఒక రాష్ట్రంలో జరిగేవి కావని అవి అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయన్నారు. పార్టీ ఫిరాయింపులను తెదేపా ప్రోత్సహించలేదని అన్నారు. జగన్ నిరంకుశత్వాన్ని భరించలేకే సీనియర్లు సైతం తమ పార్టీలోకి వచ్చారన్నారు. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షం లేకపోవటం దృరదృష్టకరమన్నారు. మంత్రి కాల్వకు సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు మల్లాది కృష్ణానంద్, జేడీ తిలక్, డీడీ కస్తూరీ, ఏడి సదారావు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఏవీ నాగేశ్వరరావు పలువురు జర్నలిస్టులు మంత్రికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

నేడే శ్రీ సీతారామ కల్యాణం
ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 4: శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించేందుకు నగరంలోని వివిధ సెంటర్లు, ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. కలియుగ వైకుంఠధాముడు శ్రీరాముని కల్యాణాన్ని నగరంలో భక్తులు ఘనంగా నిర్వహించనున్నారు. నగరంలో అతిపెద్ద వ్యాపార కూడలి బీసెంట్ రోడ్‌లో స్వామివార్ల కల్యాణ మహోత్సవాలు నిర్వహించేందుకు వేదిక, భారీ చలువ పందిళ్లు ఏర్పాట్లు చేశారు. పాతబస్తీ శివాలయం వీధిలో కార్యక్రమ నిర్వాహకులు పొట్నూరి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయం నుండి ఐరన్ సెంటర్ వరకు అతిపెద్ద చలువ పందిరి ఏర్పాటు చేశారు. ఇక్కడ వారం రోజుల పాటు స్వామివార్ల కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఐరన్ సెంటర్ నుండి కెనాల్ రోడ్ వరకు, పాత శివాలయం వరకు పందిళ్లు వేయించారు. భవానీపురం, శివాలయం సెంటర్, ఊర్మిళానగర్‌లో స్థానిక కమిటీల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. చల్లపల్లి బంగ్లా సెంటర్‌లోని శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానం ఇవో ఎ సుజన్‌కుమార్ ఆధ్వర్యంలో వారంరోజులు కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అంజనేయ వాగు సెంటర్‌లోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో ఇవో పి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. 200 మంది ప్రత్యేక ఉభయదాతల చేత స్వామివార్ల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్ మార్గంలోని శ్రీ అభంజనేయ స్వామివారి ఆలయంలో కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు దుర్గగుడి ఇవో సూర్యకుమారి ఆదేశాల మేరకు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, గవర్నపేట శ్రీ కాశీవిశే్వశ్వర అన్నపూర్ణాదేవి దేవస్థానం, మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానం, పున్నమితోట సెంటర్, ఏలూరురోడ్ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివార్ల మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇవోలు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ నగరంలోని ఆలయాలను సందర్శించి ఇవోలకు తగిన సూచనలు చేశారు. భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. ఆయన వెంట తనిఖీ అధికారి ఎ సుజన్‌కుమార్, ఎసి కార్యాలయం ఇన్‌చార్జ్ శెట్టి, ఇవోలు ఎల్ సత్యవతి, ఎం సత్యప్రసాద్, తదితరులు ఉన్నారు.