విజయవాడ

ఫ్యాన్ల చోరీ కేసులో ఇద్దరు కంపెనీ వర్కర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 8: తాము పని చేస్తున్న కంపెనీ గోడౌన్‌లోనే చోరీకి పాల్పడి ఫ్యాన్లు దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడ గ్రామానికి చెందిన ప్రజాపతి బబ్లుకుమార్(30), తాడంకి బిసి కాలనీకి చెందిన సరగడ దుర్గారావు (23) వీరిద్దరూ కొంతకాలంగా మంటా డ గ్రామంలోని ఫ్యాన్ల గోడౌన్‌లో వాచ్‌మెన్‌గా, ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నా రు. ఈక్రమంలో స్నేహితులయ్యారు. కాగా నేరాలకు అలవాటు పడి గోడౌన్ లో ఫ్యాన్ బాక్సుల దొంగతనాలకు పాల్పడ్డారు. గత ఫిబ్రవరి నెలలో రాత్రి సమయంలో గోడౌన్ తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లి బాక్సులను దుర్గారా వు ఆటోలో వేసుకుని జారుకున్నారు. తర్వాత ఏమీ తెలీనట్లు డ్యూటీకి య థావిధిగా వచ్చేశారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ద ర్యాప్తు చేపట్టిన మీదట నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3లక్షల విలువైన 50 ఫ్యాన్ బాక్సులు (ఒక బాక్సులో నాలుగు ఫ్యాన్లు) స్వాధీనం చేసుకున్నారు.

మహిళను మోసగించి నగలు దోపిడీ
పటమట, ఏప్రిల్ 8: గుర్తు తెలియని వ్యక్తులు మహిళ నుండి బంగారు చోరీ చేసిన సంఘటన శనివారం పటమట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పటమట ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్ రో డ్డుకు చెందిన గోగినేని సుజాత (58) ఉదయం 7గంటల సమయంలో కా టూరు వెళ్లడానికి పటమట సెంటర్ మీ సేవ కేంద్రం దగ్గర బస్‌స్టాప్ వద్దకు చే రుకుంది. ఈలోగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి తా ము పోలీసులమని, బంగారం వేసుకొ ని వెళితే దొంగలు దోచుకుంటున్నారని చెప్పటంతో ఆమె మెడలో ఉన్న బంగా రు గొలుసు, చేతులకున్న రెండు గాజు లు తీసి ఇచ్చింది. వారు ఆమె చీర కొం గుకు ముడివేసిట్లుగా కొంగులో గులకరాళ్లు, ఇనుప ముక్కలు పెట్టి ముడివేసి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి చీరకొంగు విప్పి చూసుకోగా బంగారం లేకపోవటంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గొలు సు, గాజులు కలిపి 10 కాసులు ఉంటాయని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.