విజయవాడ

చంద్రబాబుతోనే అంబేద్కర్ ఆశయ సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 14: నవ భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న బాబాసాహెబ్ కాంస్య విగ్రహానికి శుక్రవారం ఉదయం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిన అంబేద్కర్ ఆశయాలను స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు. అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా దేశంలో బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో దివంగత నందమూరి తారక రామారావు ఆనాటి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎన్నో ప్రజోపయోగమైన కార్యక్రమాలను అందించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలతో పాటు ఉన్నత వర్గాలకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని కొనియాడారు.
బందరు పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ అందరికీ స్వాతంత్య్ర ఫలాలు అందిన మాదిరిగానే అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్ల ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రయోజనం చేకూరిందన్నారు. బిసిలకు కూడా న్యాయం జరిగిందని ఎంపి అన్నారు. జడ్‌పి చైర్మన్ గద్దె అనురాధ మాట్లాడుతూ కుల, మత వర్గాలు, లింగభేదాలు లేకుండా సమసమాజం కోసం అంబేద్కర్ సేలందించారని కొనియాడారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని రెండు ప్రధాన ఘట్టాలు చోటు చేసుకున్నాయన్నారు. రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతోపాటు, 20 ఎకరాల్లో స్మృతి వనం, కేంద్ర ప్రభుత్వం భీమ్ యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు దేశవ్యాప్తంగా చేయడానికి కార్యక్రమాలు చేపట్టారన్నారు.

ఘనంగా గుడ్‌ఫ్రైడే
* గుణదల మాత పుణ్యక్షేత్రంలో పరిశుద్ధ శిలువమార్గం
పటమట, ఏప్రిల్ 14: గుడ్‌ఫ్రైడే సందర్భంగా గుణదలమాత పుణ్యక్షేత్రంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో పరిశుద్ధ శుక్రవారం, ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 6 గంటలకు పుణ్యక్షేత్రం రెక్టర్, ఫాదర్ యేలేటి విలియం జయరాజు ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు గుణదల కొండపై పరిశుద్ధ శిలువ మార్గం నిర్వహించారు. ఆనాడు క్రీస్తు కల్వరి గిరిపై శిలువ మోస్తూ అభవించిన పడిన పాట్లు అనుభవించిన శ్రమలు, బాధలను తెలిపే గుణదల కొండపై 14 స్థలాల శిలువ మార్గం ఘట్టాల ప్రతిమల వద్ద భక్తులు క్రీస్తు శ్రమలను స్మరించుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు కొండపై కొనసాగిన క్రీస్తు శిలువ మార్గంలో భక్తులు బరువెక్కిన హృదయాలతో క్రీస్తు శిలువ మోస్తూ అనుభవించిన కష్టాలను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శిలువ మార్గం ముగింపు అనంతరం కొండ శిఖరాన ఏసుక్రీస్తు శిలువ వద్ద భక్తులకు ఆంధ్ర లయోలా కళాశాల రెక్టర్ ఫాదర్ డి.రవిశేఖర్, పుణ్యక్షేత్రం సహాయ గురువులు జి జోజిప్రతాప్, డి.సతీష్‌లు క్రీస్తు శిలువను ప్రదర్శించగా, భక్తులు శిలువను ముద్దాడారు. 2017 సంవత్సరాల క్రితం క్రీస్తును శిలువ వేసే ముందురోజు యేసుప్రభు తన 12 మంది శిష్యులతో కలసి ఆఖరిసారిగా పాల్గొన్న ప్రభుకడరా విందు జరిగింది. ఈ సందర్భంగా గుణదలమాత పుణ్యక్షేత్రంలో రెక్టర్ యేలేటి విలియం జయరాజు పవిత్రులైన 12 మంది భక్తులను ఎంపిక చేసి వారి కాళ్ళు కడిగి, ముద్దాడి, పవిత్రమైన రొట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెక్టర్ జయరాజు భక్తులకు సందేశమిస్తూ క్రీస్తు శిలువ అంటే ప్రేమకు చిహ్నమని, ఆ శిలువ ప్రేమ ద్వారానే మనందరికి రక్షణ లభిస్తుందని అన్నారు. క్రీస్తు ప్రేమకు, త్యాగానికి ప్రతీక అన్నారు. లయోలా కళాశాల రెక్టర్ ఫాదర్ డి.రవిశేఖర్ ప్రసంగిస్తూ శిలువ మరణం పొందటానికి ఏవరూ ఇష్టపడరని, కానీ మానవాళి పాపపరిహార్ధం తండ్రి దేవుని చిత్తానుసారం యేసుక్రీస్తు శిలువ మరణంపొంది భక్తులమైన మనకు పాప క్షమాపణ ఇచ్చారని తెలిపారు.