విజయవాడ

త్వరలో క్రీడా విధానం ప్రకటిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), ఏప్రిల్ 20: రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరోగ్య, సంతోషకరమైన వాతావరణం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం నగరంలోని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయాన్ని సందర్శించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని శాప్ కార్యాలయంతో పాటు స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, వాలీబాల్, కబడ్డీ, బాక్సింగ్, టెన్నిస్ మైదానాలను జిమ్ పరికరాలను పరిశీలించారు. కొద్దిసేపు నూతనంగా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంచిన జిమ్ పరికరాలను మంత్రి పరిశీలించి వాటి ప్రత్యేకతను తెలుసుకున్నారు. అనంతరం వాలీబాల్, కబడ్డీ క్రీడాకారులను పరిచయం చేసుకుని కొద్దిసేపు వాలీబాల్, టెన్నిస్ మైదానాల్లో ఆడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాపాలసీని సిద్ధం చేయడం జరిగిందని త్వరలో ముఖ్యమంత్రి చేతులమీదగా విడుదల చేయడం జరుగుతుందన్నారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రీడలకు పెద్దపీట వేశారని బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు జరిగాయని, ఆయన హయాంలోనే జాతీయక్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు. తరువాత ప్రభుత్వం నిర్లక్ష్యంతో క్రీడలను పట్టించుకోలేదని, బడ్జెట్‌లో నిధులను కూడా కేటాయించలేదన్నారు. గత సంవత్సరం 50 క్రీడా వికాస కేంద్రాలు కేటాయించడం జరిగిందని అందులో 39 పూర్తి అయ్యాయన్నారు. ఈ ఏడాది 57 క్రీడా వికాసకేంద్రాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఒక్కొక్క జిల్లాలో 150 పాఠశాలల మైదానాలు అభివృద్ధి చేసి క్రీడాశిక్షణకు ఉపయోగించడం జరుగుతుందని, మే 1 నుండి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 20 క్రీడాంశాల్లో 50 ప్రాంతాల్లో శిబిరాలు జరుగుతాయని, శిక్షణ శిబిరం చివర్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. శాప్ ఆధ్వర్యంలో 10 అకాడమీలు నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని కెవికెలో జిమ్‌లను ఏర్పాటుచేయడం జరుగుతుందని, అద్భుతాలు సాధించడానికి క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారని వివరించారు.

ఈటిటిసి, ఇఎల్‌ఎస్‌ల తనిఖీ
* పనితీరుపై డిఆర్‌ఎం ఆరా
విజయవాడ (రైల్వేస్టేషన్), ఏప్రిల్ 20: డివిజనల్ రైల్వే మేనేజరు ధనుంజయులు ఇటిటిసి, ఇఎల్‌ఎస్ ప్రాంతాలను తనిఖీ చేశారు. మూడురోజుల క్రితం డిఆర్‌ఎంగా బాధ్యతలు చేపట్టిన ధనుంజయులు మొదటిసారిగా సత్యనారాయణపురం రైల్వే కాలనీలోని ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఈటిటిసి), దీనికి అనుసంధానంగా ఉన్న ట్రైనింగ్ సెంటర్‌లోని శిక్షణ సిబ్బందికి చెందిన వసతి గృహ సముదాయాన్ని తనిఖీ చేశారు. అనంతరం పాల ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్న ఎలక్ట్రికల్ లోకో ట్రాక్షన్ (ఇఎల్‌ఎస్) షెడ్డును విస్తృతంగా తనిఖీ చేశారు. అక్కడ రోజుకి ఎన్ని ఎలక్ట్రికల్ లోకోలు మరమ్మతులు చేపడుతున్నారు, ఎంతమంది సిబ్బంది ఉన్నారు అనే పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈటిటిసి శిక్షణ కేంద్రంలో నూతనంగా లోకోపైలెట్‌లుగా శిక్షణ పొందుతున్న వారికి ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, శిక్షణలో భాగంగా ప్రాక్టికల్స్‌గా వారికి చూపించే మిషనరీలను ఏర్పాటు చేసి ఉన్న ప్రాంతాలను తనిఖీ చేశారు. అదనపు డివిజనల్ రైల్వే మేనేజరు కె వేణుగోపాలరావు, వివిధ విభాగాల బ్రాంచి అధికారులు పాల్గొన్నారు.