విజయవాడ

సత్తాచాటిన సుంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఏప్రిల్ 21: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హోరాహోరీగా శుక్రవారం జరిగిన ఆటోనగర్ ఎపిఐఐసి ఐలా ఎన్నికలో రెండోసారి కూడా సుంకర దుర్గాప్రసాద్ (్ఫండ్రీ ప్రసాద్) ప్యానల్ అత్యధిక వార్డులను కైవసం చేసుకుని ఐలా పాలకపగ్గాలు చేపట్టనున్నారు. సుంకర దుర్గాప్రసాద్ 93 ఓట్లతో తమ పత్యర్థి చైర్మన్‌గా పోటీకి దిగిన సాధిక్‌పై విజయం సాధించి ఐలా చైర్మన్ పీఠంపై రెండోసారి కూర్చోనున్నారు. సుంకర పాన్యల్ వర్గానికి చెందిన వైస్ చైర్మన్ పంచుమర్తి ప్రసాదరావుతమ పత్యర్ధి అమర సుబ్రమణ్యంపై 111 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదే ప్యానల్ నుండి సెక్రటరీగా రంగంలోకి దిగిన అనే్న శివ నాగేశ్వరరావు తమ ప్రత్యర్థి గాజుల బాలగంగాధర తిలక్‌పై 140 ఓట్లతో మెజార్టీ సాధించారు. సుంకర ప్యానల్ నుండి జాయింట్ సెక్రటరీ పదవికి పోటీచేసిన మహబూబ్ ఖాన్ తమ ప్రత్యర్థి మున్నాబాయిపై 160 ఓట్లు మెజార్టితో గెలుపొందారు. కోశాధికారిగా బాయన బాబుజీ సుంకర పాన్యల్ తరుపున అంతకుముందే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుంకర దుర్గాప్రసాద్ ప్యానల్ వర్గానికి ప్రత్యర్థి పాన్యల్‌గా ఎన్నికల్లో బరిలోకి దిగిన సాధిక్ ప్యానల్ వర్గం కేవలం 8, 9 వార్డులలో గెలుపొంది రెండు వార్డులతోనే సరిపెట్టకోవాల్సి వచ్చింది. మొత్తం 13 వార్డులకు ఐలా ఎన్నికలు జరుగ్గా అందులో సాధిక్ పాన్యల్ వర్గం రెండు వార్డులకే పరిమితం కాగా, సుంకర దుర్గాప్రసాద్ పాన్యల్ 11వ వార్డులలో అత్యధిక స్థానాలు గెలుపొంది విజయకేతనం ఎగురవేశారు. ఏడు వార్డులలో అంతకుముందే సుంకర ప్యానల్ వర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఐలా చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ ప్యానల్ ఈసారి కూడా ఐలా ఎన్నికల్లో తమ సత్తాను చాటటంతో ఆటోనగర్‌లో సంబరాలు అంబర్నాంటే విధంగా అభిమానులో పెద్ద ఎత్తున టపాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మొత్తం ఐలాలో ఎన్నికల్లో 1366 ఓట్లు వుండగా, 974 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఐలా ఎన్నికల ఓటింగ్ మొదలై సాయంత్రం 3 గంటల వరకు కొనసాగింది. 4 గంటలకు ఎన్నికల కౌటింగ్ ప్రారంభమై రాత్రి 10 గంటలకు ఐలా ఎన్నికల అధికారి ఆర్.వెంకట్రావ్ ఫలితాలను ప్రకటించారు. ఎసిపి సత్యానందం, పటమట సిఐ కెనడీ, మాచవరం సిఐ ఉమమహేశ్వరరావు, పెనమలూరు సిఐ దమోదర్ అధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు పట్టిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రశాంతగా ముగియటంతో అటు పోలీసులు, ఇటు ఆటోనగర్ ప్రజలు ఊపీరిపీల్చుకున్నారు. రెండో సారి ఐలా పీఠంను సుంకర ప్యానల్ వర్గం దక్కించుకోవటంతో రాత్రి ఆటోనగర్ ప్రాంతం కోలహలంగా మారింది.

ప్రజా సమస్యలపై పోరాటం చేయలేక
సోషల్ మీడియాలో దుశ్ఛర్యలా..?

విజయవాడ, ఏప్రిల్ 21: వైసిపి నేతల ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో పెట్టిన కార్టూన్లు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి.. రాష్ట్ర శాసనసభ ప్రతిష్ఠనే దిగజార్చే విధంగా వ్యవహరించిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటే తప్పేంటిని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ధ్వజమెత్తారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీని నేరుగా ఢీకొట్టే దమ్ములేక వైకాపా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయటమేనన్నారు. రాష్ట్భ్రావృద్ధిని సహించలేక, ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాటం చేయలేక వైసిపి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని టిడిపి నేతలపై బురద చల్లుతోందన్నారు. విమర్శలు చేసేటప్పుడు అవి ఎదుటివారి తప్పుల్ని సరిదిద్దేలా ఉండాలేగాని వారిపై బురద చల్లేలాగ ఉండకూడదన్నారు. సిఎం చంద్రబాబు రోజుకు 18 గంటలు కృషి చేస్తున్నారు.. అలాగే మంత్రి లోకేష్ కూడా ప్రజల కోసం పని చేస్తున్నారు.. అలాంటి వ్యక్తులపై సోషల్ మీడియాలో బురద జల్లడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి పోస్టులు పెడితే ఐటి యాక్టు ప్రకారం శిక్షార్హులౌతారన్నారు. ఇప్పటికైనా వైసిపి నేతలు ప్రజా సమస్యలపై పోరాడాలేగానీ, సోషల్ మీడియా ద్వారా బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ప్రముఖ కార్టూనిస్టులు శ్రీ్ధర్, మోహన్ వంటివారు దివంగత నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబునాయుడు వంటి ఎందరో ప్రముఖులపై అనేక కార్టూన్లు వ్యంగ్యంగా పెట్టేవారని, కానీ అవి ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా కించపర్చేవిగా ఉండేవి కావన్నారు. ఆర్‌కె లక్ష్మణ్ వంటి కార్టూనిస్టులు తమ వ్యంగ్య చిత్రాలతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారని గుర్తు చేశారు.