విజయవాడ

రహదారి భద్రతపై రాజీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 27: రహదారి భద్రత కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పటిష్టంగా అమలు పరచాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. రహదారి భద్రతా కమిటీ సమావేశం గురువారం జిల్లా కలెక్టర్, కమిటీ చైర్మన్ అధ్యక్షతన కలెక్టర్ క్యాంపు కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తక్షణమే అమలు పరచేలా ఉండాలన్నారు. మే నెల 16వ తేదీ నిర్వహించే తదుపరి సమావేశానికి అధికారులు యాక్షన్ టెకెన్ రిపోర్టుతో సిద్ధమై హాజరుకావాలన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించారు. సితార జంక్షన్ వద్ద రహదారిని విస్తరించాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణకు సంబంధిత కంపెనీ ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. నందిగామ, జగ్గయ్యపేట, గుడివాడ వద్ద ట్రోమాకేర్ సెంటర్లను తక్షణం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిఎం అండ్ హెచ్‌ఓను ఆదేశించారు. జగ్గయ్యపేట ప్రాంతంలో సిమెంట్ లారీలకు ప్లాస్టిక్ రేడియం స్టిక్కర్లను అతికించాలని ఆదేశించామన్నారు. డ్రంక్ డ్రైవ్ పట్ల పోలీసు, రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బ్రహ్మలింగయ్య చెరువు నుండి జాతీయ రహదారికి ప్రవేశించే లారీలు నేరుగా కాకుండా యూ టర్న్ తీసుకుని రోడ్డు పైకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హెల్మెట్ల వాడకం తప్పనిసరి చేస్తున్నామని, దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ యజమానులు, డ్రైవర్లతో తరచూ సమావేశాలు ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మే నెల 2వ తేదీన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులకు సూచించారు. డిసిపి టి కె రాణా మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరగడానికి స్ట్రిట్ లైట్లు లేకపోవడం కారణంగా గుర్తించామన్నారు. ఇబ్రహీంపట్నం నుండి దొనబండ, గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి హనుమాన్ సెంటర్ వరకు ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లాక్ మార్కెట్‌లో సినిమా టికెట్లు విక్రయించేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ అన్నారు. బ్లాక్ మార్కెట్‌లో సినిమా టికెట్లు విక్రయించే వారిపై గట్టి నిఘా ఉంచాలని తహశీల్దార్లు, పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అవసరమయితే సంబంధిత సినిమా థియేటర్ల లైసెన్స్‌లను సెక్షన్ 9 ఎ యాక్టు ప్రకారం రద్దు చేసేందుకు కూడా వెనుకాడేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, డిటిసి ఇ మీరా ప్రసాద్, ఆర్డీవోలు సాయిబాబు, చక్రపాణి, ఆర్ అండ్ బి ఎస్‌ఇ శేషుబాబు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలి
* ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
* కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
* బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి
విజయవాడ (బెంజిసర్కిల్), ఏఫ్రిల్ 27: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి అన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. భారతీయ యువమోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం గురువారం నగరంలో నిర్వహించారు. వివరాలను నగరంలోని హోటల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. యువమోర్చా అధ్యర్యంలో ఈ ఏడాది నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు, పోలింగ్ బూత్‌ల స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే పార్టీ సిద్ధాంతకర్తలు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి, వర్ధంతి సందర్భంగా ఈ ఏడాది పలు కార్యాక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలు చెల్లిస్తామని ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినందున వెంటనే దానిని అమలు చేయాలన్నారు. ఉద్యోగ వయోపరిమితిని పెంచాలని, హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం సవరించిన విధంగా వేతనాలు చెల్లించాలన్నారు. అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హోంగార్డులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. విద్యాశాఖలో అవినీతి కారణంగా విద్యార్థుల నుండి ఫీజుల పేరుతో వేల రూపాయలు దోచుకుంటున్నారని, దీనిని నివారించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలలను ప్రభుత్వం పాఠశాలల్లోనే చదివించి అందరకి అదర్శంగా నిలవాలన్నారు. జాతీయ నాయకుల జయంతి, వర్ధంతి సెలవలను రద్దు చేసి ఆరోజున సంబంధిత నాయకుని జీవితచరిత్రను పిల్లలకు వివరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రంలో అధికారంలోనికి వచ్చిన తరువాత అమలు చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించేలా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పెరుగుతున్న సినిమా టిక్కెట్ల ధరలను నియంత్రించాలన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా కుటుంబాలను అప్రదిష్టపాలుచేయడం ద్వారా వ్యక్తులపై దుప్ప్రచారానికి పాల్పడిన సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న రెండు రాజకీయ పార్టీల వైఖరిని ఈసందర్భంగా ఆయన ఖండించారు. విలేఖరుల సమావేశంలో నాయకులు ఎస్‌వి రాఘవేంద్ర, అడారి కిషోర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.