విజయవాడ

పద్మభూషణ్ సుశీలకు ‘గానామృత వర్షిణి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), మే 3: శ్రీ సోమనాథ్ కల్చరల్ ఆర్ట్స్, దేశికా ఆర్ట్స్ అకాడమీ, స్వర మధురిమ కల్చరల్ ఆర్ట్స్, విశ్వశ్రీ క్రియేషన్స్ సంయుక్త నిర్వహణలో మంగళవారం సాయంత్రం ఘంటసాల విఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలోని కళావేదిక సుప్రసిద్ధ నేపధ్య గాయనీమణి పద్మభూషణ్ పి.సుశీలకు గానామృత వర్షిణి బిరుదు ప్రదానం జరిగింది. అశేష జనవాహిని కరతాళ ధ్వనుల మధ్య ఆమె ఈ బిరుదును ఘన సత్కారంతో అందుకున్నారు. పద్మశ్రీ డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు సభను ప్రారంభించగా ముఖ్య అతిథులుగా, ఆత్మీయ అతిథులుగా, విశిష్ట అతిథులుగా, గౌరవ అతిథులుగా ప్రత్యేక ఆహ్వానితులుగా దాదాపు 25 మంది పాల్గొనగా డాక్టర్ జివిఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ వరప్రసాద్ సంపూర్ణలక్ష్మి దంపతులు సత్కారకర్తలుగా వ్యవహరించారు. దాదాపు పలు భాషల్లో 40వేల పాటలు పాడిన ఆమె భారతదేశ కీర్తిని ఇనుమడింపచేశారని వక్తలు పేర్కొన్నారు. తనకు జరిగిన ఈ సన్మానం తనను ఉబ్బితబ్బిబ్బు చేస్తోందని, మరచిపోలేని గొప్ప అనుభూతిని కలిగిస్తుందని సుశీల అన్నారు. పలు కళా సంస్థలవారు, ఆమె అభిమానులు ఆమెతో ఫొటో దిగటానికి చేసిన సందడి ఇంతా అంతా కాదు. అదే వేదికపై ప్రారంభంలో స్వాగత నృత్యం, మిమిక్రి, తదుపరి దాదాపు 16 మంది గాయనీ గాయకులతో సినీ సంగీత విభావరి వంటివి జరగటం, సన్మాన వేదికపై దాదాపు 25 మందిని అతిథులుగా ఆహ్వానించటంపై ఆహూతుల్లో విమర్శలు వెల్లువెత్తాయి. నిర్వాహకులు ఏ కార్యక్రమానికి ప్రాధాన్యత నిచ్చారో తెలీని స్థితిలో మహా గాయనికి సన్మాన కార్యక్రమం జరిగిందని, ఏ ఒక్క కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయామని, సన్మాన గ్రహీత ఏ రంగంలో దేశానికి కీర్తి తెచ్చారో దానికి సంబంధించిన కార్యక్రమం పెడితే బావుండేదని విచ్చేసిన ప్రేక్షకులు, శ్రోతలు అందరూ విమర్శించుకోవటం గమనార్హం. పర్యవేక్షణ నిర్వహణ బొలిశెట్టి రాధాకృష్ణమూర్తి చేశారు.