విజయవాడ

అవినీతిపరుడికి క్రీడాకారుల విలువేం తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), మే 16: జగన్ రాజకీయం చేస్తూ క్రీడాకారులను క్రీడారంగాన్ని అవమానిస్తున్నారని శాప్ మాజీ చైర్మన్ పిఆర్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీ తండ్రి గానీ మీరు గానీ ఒక్క రోజైనా రైతుల గురించి ఆలోచించారా?’ ఒక అవినితిపరుడికి క్రీడాకారుల విలువ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ‘ఒలింపిక్స్‌లో పతకం సాధించడమంటే జైల్లో ఉండి రావడం అనుకుంటున్నావా’ అని విమర్శించారు. ‘క్రీడాకారుల విలువ, వ్యవసాయం అంటే నీకు తెలుసా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతు దేశానికి వెనె్నముక అయితే క్రీడాకారులు దేశ ప్రతిష్ట పెంచేవారన్నారు. రైతు సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం అమలు చేయని కార్యక్రమాలను తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిందని, ఎన్నో కష్టానష్టాలను ఓర్చి ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన ఒక క్రీడాకారిణికి వైకాపా ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. భారతదేశ కీర్తిని ఇనుమడింపచేసేలా తెలుగు వారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన పివి సింధుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించిందని, ఇకనైనా జగన్ చౌకబారు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

ఆంధ్ర క్రికెట్ అండర్-23 జట్టు ఎంపిక
విజయవాడ (స్పోర్ట్స్), మే 16: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఅండర్-23 క్రికెట్ జట్టును ఎంపిక చేసినట్లు ఆ సంఘ కార్యదర్శి సిహెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఎంపికైన ఈ జట్టు ముంబైలో 18నుండి 28వతేదీ వరకు జరుగనున్న డా మాధవ్ మంత్రి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాలొంటుందని పేర్కొన్నారు. ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా రిక్కిబొయె వ్యవహరిస్తాడు. జట్టులో జి జయవర్ధన్, సిఆర్ జ్ఞానేశ్వర్, కె మహిప్‌కుమార్, ఎస్ ధృవ్‌కుమార్ రెడ్డి, డి నరేన్‌రెడ్డి, కరణ్ షిండే, యుఎంఎస్ గిరినాధ్, కార్తీక్ రమన్, పి గిరినాధ్ రెడ్డి, వై పృధ్వీ రాజ్, కెవి శశికాంత్, ఎ వినయ్ కుమార్, జి మనీష్, కె భీమారావులు ఉన్నారు. స్టాండ్‌బైలుగా కె క్రాంతి కిరణ్, డిజిజె చైతన్య, వై సందీప్, పి తేజశ్వీ, సూర్యలు ఎంపికయ్యారు.