విజయవాడ

నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, మే 16: నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగడం అవసరమని, తద్వారా భవిష్యత్ తరాల మనుగడకు సహకరించిన వారమవుతామని కొత్తపేటలోని ఎస్‌కెపివి హిందూ హైస్కూల్ కమిటీ ప్రథమ కార్యదర్శి కెఎల్ మోహనరావు అన్నారు. మంగళవారం స్కూల్ ఆవరణలో రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులను అనుసరించి ఇంకుడు గుంటల ఏర్పాటు కార్యక్రమాన్ని పూజచేసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నీటి సంరక్షణ అనేది ఒక వ్యసనంలా మారాల్సి ఉందన్నారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కంచర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయ ప్రతినిధి డాక్టర్ శామనపూడి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు జూపూడి ఆనందకుమార్, ఎన్‌సిసి అధికారి బి.బ్రహ్మేశ్వరరావు, సునీల్, రాధ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
పెనమలూరు (టౌన్), మే 16: జాతీయ రహదారిపై గోసాల గ్రామ పరిధిలోని ఒకటో తూము వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం ఉయ్యూరు గ్రామానికి చెందిన ఈడే మునీశ్వరరావు(55) అక్కడికక్కడే మృతి చెందాడు. మునీశ్వరరావు ఉయ్యూరు నుంచి విజయవాడ స్కూటీపై వెళుతూ గోసాల గ్రామ పరిధిలోని ఒకటో తూము దాటుతుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొని తలపైగా వెళ్లడంతో తల ఛిద్రమైపోయింది. స్కూటీ మాత్రం లారీ ముందు భాగంలో పడిపోయింది. సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. వివరాలు నమోదు చేసుకుని సంఘటనా ప్రదేశం పెనమలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోనిది కావడంతో ఇక్కడి పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్‌ఐ తెలిపారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జలసంరక్షణ పనులు వేగంగా జరగాలి
* కలెక్టర్ లక్ష్మీకాంతం
పెనమలూరు (టౌన్), మే 16: జలసంరక్షణ పనులు వేగంగా చేపట్టాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం పెనమలూరు అధికారులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మండలంలో జరుగుతున్న నీరు-చెట్టు పనులపై అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పథకం ద్వారా జరుగుతున్న పంట కుంటలు, ఇంకుడు గుంటల పనులు కూలీలతో ఉదయం 11 గంటల్లోపు ముగించాలని వారికి ఎండ ప్రభావం తగలకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వి.మురళీకృష్ణ, ఎండివో వి.రమాదేవి, ఎంపిపి బొర్రా కనకదుర్గ, వైస్ ఎంపిపి కోయా ఆనంద్, వివిధ శాఖల అధికారులు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.