విజయవాడ

భారీగా ఐటీ ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 6: రాబోయే రెండేళ్లలో ఐటి రంగంలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేలా బృహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర యువజన, క్రీడా, న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా మంగళవారం ఎ కనె్వన్షన్ సెంటర్‌లో మానవ వనరుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పనపై ఉద్యోగస్తులు, యువతతో సదస్సు నిర్వహించారు. ఈసందర్భం గా ఆయన మాట్లాడుతూ 2014 తర్వాత రాష్ట్రంలో నైపుణ్య సామర్ధ్యం పెంపొందించే విధంగా అనేక శిక్షణ కేంద్రాలు నెలకొల్పి యువతలో ఆయా అంశాలపై శిక్షణ అందించడం ద్వారా ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో 2లక్షల మందికి ఐటి ఉద్యోగాలు రానున్నాయన్నారు. ఐటి రంగంలో ఏపికి చెందిన తెలుగువారికి మంచి సామర్ధ్యం ఉందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి కియో మోటారు లాంటి విదేశీ కంపెనీలను రాష్ట్రంలో ఏర్పాటుచేసి ఇక్కడి ప్రజానీకానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనలేని కృషి చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలో చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను నెలకొల్పడానికి యువతను ప్రోత్సహించే విధంగా శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఎంఓయులు కుదుర్చుకోవడం ద్వారా యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. మాతా శిశు మరణాల సంఖ్య తగ్గిందని, పౌష్టికాహారం లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా మహిళలకు గత మూడు సంవత్సరాలుగా వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం ద్వారా శిక్షణ ఇప్పించి జీవనోపాధి కల్పిస్తున్నామని తెలిపారు. శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతోపాటు వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాల ద్వారా యువతకు అనేక అవకాశాలున్నాయన్నారు. బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తూ గత మూడేళ్లుగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నారన్నారు. డాక్టర్ చక్రపాణి, ఆదిత్యనాధ్ దాస్, ప్రభుత్వ కార్యదర్శి పండా దాస్, స్కిల్ డెవలప్‌మెంట్ డైరక్టర్ ఘంటా సుబ్బారావు, హౌసింగ్ కార్పొరేషన్ డైరక్టర్ కాంతిలాల్ దండే, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి వచ్చే అర్హత రాహుల్ గాంధీకి లేదు:దారా

విజయవాడ, జూన్ 6: రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ సహా కాంగ్రెస్ నాయకులకు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చే అర్హత లేదని భారతీయ జనతా పార్టీ ఎస్‌సి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య హెచ్చరించారు. ఎలాంటి వసతులు లేకుండా, రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఈసడించుకుంటున్నారని ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో విమర్శించారు. వారి సభలను బహిష్కరించడమే కాక తీవ్రంగా ద్వేషిస్తున్నారనే విషయాన్ని గుర్తుచేశారు. వారు ప్రజలను వంచించేందుకు ఎన్ని ఎత్తులు వేసినా ప్రయోజనం లేదని, 20ఏళ్ల తర్వాత కూడా వారికి అధికారం వచ్చే అవకాశం లేదన్నారు. వారు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. విజయవాడలోని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం సాంబయ్య విలేఖరులతో మాట్లాడుతూ గుంటూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో రాహుల్ హోదా విషయంలో బిజెపిపై చేసిన విమర్శలను ఖండించారు. రాజకీయ స్వార్థంతో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల మధ్యకు వచ్చే అర్హత లేదన్నారు. ప్రత్యేక హోదా మీద ఇప్పుడు గొంతు చించుకుంటున్న రాహుల్ హోదా విషయం ఎందుకు విభజన చట్టంలో పొందుపరచలేదని దారా ప్రశ్నించారు.