విజయవాడ

సమాజానికి విలువైన ఆస్తి వృద్ధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 14: వృద్ధులను విలువ కట్టలేని వ్యక్తులుగా, సమాజానికి లభించిన విలువైన, అమూల్యమైన ఆస్తిగా భావించాలని, వీరిని పండుటాకుల్లా కాక పరిణతి చెందిన మనస్కులుగా స్వీకరించి స్వీయానుభవాల నుండి భవిష్యత్ తరాలు తమ సమస్యల పరిష్కార మార్గాలు తీసుకోవాలని వక్తలు అన్నారు. బుధవారం ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినాన్ని పురస్కరించుకుని బందరు రోడ్డులోని డివి మేనర్ నుండి ఎ కనె్వన్షన్ సెంటర్ వరకు వృద్ధులతో భారీ ర్యాలీని నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ర్యాలీలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, మాజీ ఎంపి చెన్నుపాటి విద్య, డా. కీర్తి, సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు ముకుందరావు, అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ఎంసి దాస్, డిసిపిలు పాలరాజు, క్రాంతిరాణా టాటా, జివిజి అశోక్‌కుమార్, ఎడిసిపి నాగరాజు, ఎసిపిలు రమేష్‌బాబు, సత్యానందం, రామకృష్ణ, విజయభాస్కర్, శ్రీనివాసరావు, శ్రావణ్‌కుమార్, వెంకటేశ్వర్లు, జివి రమణారావు, గుణరామ్ పాల్గొని వృద్ధుల విలువను వివరించారు. ఐశ్వర్యాన్ని కాకుండా అభిమానాన్ని కోరుకుంటారని, వారికి ప్రేమానురాగాలు పంచాలని, ఆస్తి కోసం వేధించకుండా సమాజానికి వారినే పెద్ద ఆస్తిగా భావించాలని చెప్పారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా ప్రజలకు ఎన్నో విధాలుగా సేవలు అందించటం సంతోషదాయకమని, ఇలాంటి సేవల ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతున్నారని అభినందించారు. అనంతరం వృద్ధులకు వివిధ ఆసుపత్రుల సహకారంతో ఉచిత వైద్య సేవలు అందించారు. కంటి పరీక్షలు, దంత పరీక్షలు, కిడ్ని, కీళ్లకు సంబంధిచిన పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చట్టపరమైన న్యాయ సలహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బిఐ ఆధ్వర్యంలో ఆర్థిక లావాదేవీలపై సలహాలు, సూచనలు అందించారు.