విజయవాడ

రౌడీషీటర్ హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 26: కరుడుగట్టిన రౌడీషీటర్ హత్య కేసులో ఆరో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... గుణదల గంగానమ్మగుడి రోడ్డులో నివాసముంటున్న కటికల అవినాస్ (27) నేర కార్యకలాపాలకు పాల్పడుతుండేవాడు. పని లేకుండా తిరుగుతూ.. కొట్లాటలు, హత్య కేసుల్లో నిందితునిగా పోలీసుల రికార్డులకెక్కాడు. కాగా.. బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అవినాష్ భోజనం చేశాడు. కుటుంబ సభ్యులు మేడపైకి వెళ్లి పడుకోగా.. ఒంటరిగా ఉన్న ఇతను ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు అవినాష్ రౌడీషీటర్ హత్య కేసులో ఆరో నిందితునిగా ఉన్నాడు. మాచవరం పోలీస్టేషన్‌లో రౌడీషీటర్‌గా ఉన్న శ్రీనివాసరావు అలియాస్ కుక్క గత ఏడాది దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గుణదల మూడు వంతెన సెంటర్ కాల్వగట్టు ప్రాంతంలో కుక్కను అతని స్నేహితులే మద్యం మత్తులో రాళ్లతో కొట్టి చంపారు. ఈ కేసులో నిందితులు అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రస్తుతం కేసులో కేసు కోర్టు విచారణలో కొనసాగుతోంది. ఈకేసులో ఆరో నిందితుడైన అవినాష్ ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుని తండ్రి కటికల రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.