విజయవాడ

రైతు వ్యతిరేక ప్రభుత్వాలను సాగనంపుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూన్ 15: రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాలను సాగనంపాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పివి ఆంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం మైలవరం మండల వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ మండలంలోని చండ్రగూడెం శివాలయంలో జరిగింది. ఈసభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్ శక్తులకే సహకరిస్తున్నాయని, రైతాంగ ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని ఆరోపించారు. పోరాటాల ద్వారానే రైతాంగ సమస్యలను పరిష్కరించుకోగలమన్నారు. రహదార్ల విస్తరణ సమయంలో రైతులు కోల్పోయిన భూములకు పోరాటాల ద్వారానే సముచితమైన ధరను సాధించుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షుడు రావూరి రామారావు మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామాలలో తొలకరి సీజన్ ప్రారంభమైనందున నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయని, రైతులు జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు. ఇన్‌పుట్ సబ్సీడీ రైతులకు అందించాలన్నారు. కౌలురైతు సంఘం నాయకుడు ఎండి జానీ మాట్లాడుతూ కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులిచ్చి వారికి బ్యాంకులలో రుణాలు మంజూరు చేయించాలన్నారు. తారకరామా ఎత్తిపోతల పధకం ద్వారా సాగునీటిని రప్పించి చెరువులను నింపాలని కోరారు. అనంతరం పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈకార్యక్రమంలో మండల స్థాయి నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
రైతుసంఘం అధ్యక్షునిగా రావుల
రైతుసంఘం మండల అధ్యక్షునిగా రావుల సుబ్బారావు, కార్యదర్శిగా వజ్రాల వెంకట రెడ్డిని సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సమావేశం అనంతర నూతన కమిటీలో సహాయ కార్యదర్శిగా కందుల పరమేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా తోట నాగయ్యలను ఎన్నుకున్నారు.

డంపర్ బిన్ రహితంగా నగరం
* రూపకల్పనకు కమిషనర్ నివాస్ ఆదేశం
విజయవాడ (కార్పొరేషన్), జూన్ 15: రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న నగరాన్ని డంపర్ బిన్ రహితంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విఎంసి కమిషనర్ జె నివాస్ పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా ఇంటింటా జరుగుతున్న చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించి ఇంటి వద్దే తడి - పొడి చెత్తలుగా విభజించి సేకరించి రీ సైక్లింగ్ ప్రక్రియకు ప్రోత్సహించాలన్నారు. తడి చెత్తను కంపోస్టు ప్లాంట్‌కు, పొడి చెత్తను కటింగ్ మిషన్ ప్లాంట్‌కు తరలించి తదుపరి వేస్ట్‌ను మాత్రమే డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ నుంచే సేగ్రిగేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తే డంపర్ బిన్ల వినియోగం తగ్గుతుందన్నారు.
నగర పర్యటనలో భాగంగా గురువారం ఉదయం 57వ డివిజన్‌లో పర్యటించిన ఆయన అక్కడ జరుగుతున్న చెత్తసేకరణ చర్యలను పరిశీలించారు. తడి పొడి చెత్త సేకరణ ప్రక్రియను తొలతు 57వ డివిజన్ నుంచే ప్రారంభించాలని, ఎవరైనా ఇంటి వారు తడి పొడి చెత్తలను విడివిడగా కాకుండా ఏక మొత్తంగా చెత్త అందిస్తే వారి వద్ద నుంచి చెత్తను తీసుకోకుండా వారితోనే చెత్త విభజన చేయించి తదుపరి చెత్త సేకరణ చేయాలన్నారు. చెత్త విభజనకు ప్రతి ఇంటికి రెండు డస్ట్‌బిన్లను పంపిణీ చేసిన ఆయన చెత్త సేకరణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. డంపర్ బిన్ లేని డివిజన్‌గా 57వ డివిజన్‌ను తీర్చిదిద్దాలని, ఇందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. 50 మైక్రాన్ కంటే తక్కువ గల క్యారీ బ్యాగ్‌లపై వినియోగంపై పూర్తి నిషేదాన్ని అమలుచేయాలని, వినియోగించిన వారిపై ప్రజారోగ్య చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడమే కావడమే కాకుండా బాధ్యులైన వారిపై అపరాధ రుసుము కూడా విధించాలన్నారు. కొబ్బరి బొండాలు, చెట్ల కొమ్మలు తదితర గట్టి వాటిని ముక్కలు ముక్కలుగా చేసే పల్వనైజర్ మేషిన్‌ను వాడుకలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ బాబు శ్రీనివాస్, డిఇఇ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.