విజయవాడ

రౌడీ రాజకీయాలు మానుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూన్ 17: తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు రౌడీ రాజకీయాలు చేయడం మానుకోవాలని లేకుంటే ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని వైకాపా కార్పొరేటర్ల ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల హెచ్చరించారు. పాతబస్తీలోని వైకాపా నగరాధ్యక్షుడు వెలంపల్లి కార్యాలయంలో శనివారం ఉదయం పుణ్యశీల కార్పొరేటరులు షేక్ ఆసిఫ్, సంధ్యారాణి, పూర్ణమ్మ, విజయ్‌తో కలిసి విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా నగరాధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు అధికార పార్టీపై చేసిన రాజకీయ ఆరోపణలను సాక్ష్యాలతో రుజువు చేసుకోవాలన్నా రు. అధికారపార్టీ లోపాలను విపక్షాలు ఎత్తిచూపటం తప్పు కాదన్నారు. వెలంపల్లిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేని టిడిపి కార్పొరేటర్లు వెలంపల్లి ఇంటిని ముట్టడించి భయభ్రాంతులకు గురిచేయటం తగదన్నారు. ఇప్పటి వరకు టిడిపి ఆరాచకాలను శాంతియుతంగా ఎదుర్కొంటున్న వైకాపాను తక్కువ అంచనా వేయరాదన్నారు. విపక్ష నేతలపై భౌతిక దాడులకు పాల్పడితే తాము చూస్తూ ఊయికునేది లేదన్నారు. వైకాపా అర్బన్ అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావును విమర్శించే హక్కు టిడిపి కార్పొరేటరులకు లేదన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు చేసిన రాజకీయ ఆరోపణలపై బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం టిడిపి నేతలకు ఉందా అని వారు సవాల్ చేశారు. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు కంపాగంగాధర్‌రెడ్డి, పైడిపాటి మురళీ, గ్రంధి రమేష్, వాజిద్ ఖాన్, సూరిబాబు, నజీద్, శివ,తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ఇంద్రకీలాద్రి, జూన్ 17: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను శనివారం ఉదయం హైకోర్టు న్యాయమూర్తి సురేష్ కుమార్ కైత్ తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి దర్శించుకున్నారు. ఈసందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలనంతరం ఆశీర్వాద మండపంలో అర్చకులు ఆయనకు దివ్య ఆశీస్సులు ఇవ్వగా పిఎ రామోహనరావు దుర్గమ్మ చిత్రపటం, ప్రసాదాలను అందచేశారు. అలాగే గుంటూరు-కృష్ణా జిల్లా న్యాయమూర్తి రామ సుబ్రహ్మణ్యం తమ కుటుంబ సభ్యులతో వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇదేవిధంగా వేర్వేరు సమయాల్లో కేంద్ర, ప్రభుత్వ ఉన్నతాధికారులు దుర్గమ్మను దర్శించుకున్నారు.