విజయవాడ

కృష్ణకుమార్, సుమశ్రీ కోసం వేట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 27: క్యాన్సర్‌తో మరణించిన చిన్నారి సాయిశ్రీ ఉదంతంలో తెర మీదకు వచ్చిన తల్లి సుమశ్రీ, ఆమె భర్త పోలిన కృష్ణకుమార్ దంపతుల కోసం వేట సాగుతోంది. విడివిడిగా తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నైలో కూడా నమోదైన వేర్వేరు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. అయితే చాలాకాలం నుంచి కోర్టుకు హాజరుకానందున నిందితులపై కోర్టు ఆదేశాలతో అరెస్టు వారెంట్లు జారీ అయినట్లు తెలిసింది. తన బిడ్డ సాయిశ్రీకి తండ్రి మాదంశెట్టి శివకుమార్ అంటూ వెలుగులోకి వచ్చిన సుమశ్రీ తన భర్త పోలిన కృష్ణకుమార్ అని ఏకంగా మీడియా ఎదుటే వీరిద్దరూ కలిసి కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా క్యాన్సర్‌తో మరణించిన చిన్నారి సాయిశ్రీని తాను పెంచుకున్నానని చెప్పుకొచ్చిన మాదంశెట్టి శివకుమార్ బాలిక పేరుతో దుర్గాపురంలోని అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి తాను మాత్రం సంరక్షకునిగా ఉన్నట్లు మీడియాకు వెల్లడించాడు. అయితే చిన్నారి మరణానంతరం సుమశ్రీ, ఆమె భర్త పోలిన కృష్ణకుమార్ తమ పరివారంతో కలిసి ఫ్లాట్‌లో ఉంటున్నందున వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈక్రమంలో గతంలో వీరిపై హైదరాబాద్, చైన్నై తదితరచోట్ల నమోదైన కేసులు ఇప్పుడు వెలుగులోకి రావడం గమనార్హం. ఈ రెండు నగరాల పోలీసులు శుక్రవారం రాత్రి నగరంలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు శనివారం తెల్లవారుజామున దుర్గాపురంలోని అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే సమాచారం తెలియడంతో ఫ్లాట్ వదిలి దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సుమశ్రీ భర్త పోలిన కృష్ణకుమార్, అతని సోదరుడు సుధీర్‌కుమార్‌పై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్టేషన్‌లో ఓ వృద్ధ దంపతుల ఇల్లు కబ్జా కేసు నమోదైంది. 2009 అక్టోబర్ 31న బాధితుల ఫిర్యాదు మేరకు నమోదైన కేసు విచారణ ప్రస్తుతం కోర్టులో కీలక దశలో కొనసాగుతోంది. సాక్షుల విచారణ కూడా దాదాపు పూర్తి కావడంతో చాలాకాలంగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న కృష్ణకుమార్‌పై అరెస్టు వారెంట్ జారీ అయింది. దీంతో హైదరాబాద్ పోలీసులు నగరానికి వచ్చారు. వీరి రాకను ముందుగానే పసిగట్టిన నిందితుడు కృష్ణకుమార్ పరారైనట్లు వచ్చిన పోలీసులకు స్పష్టమైంది. ఇదే కేసులో రీకాల్ చేయించుకునేందుకు నిందితులు హైదరాబాద్‌లో ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా.. సుమశ్రీపై చెన్నై టి.నగర్ పోలీస్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్లు సమాచారం. నగరానికి వచ్చిన చెన్నై పోలీసుల బృందంలో మహిళా సిబ్బంది కూడా ఉన్నారు. అక్కడ ఓ వ్యభిచారం కేసు, ఓ చోరీ కేసులో నిందితురాలిగా ఉన్నందున ఆయా కేసుల్లో అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన చెన్నై బృందం ప్రస్తుతం నగరంలోనే మకాం వేసింది. కాగా పోలీసుల గాలింపుల వాసన పసిగట్టిన వీరు నగరం వదిలి వెళ్తూ.. చిన్నారి సాయిశ్రీకి చెందిన ఏటిఎం కార్డును శనివారం వినియోగించినట్లు గుర్తించారు. మాదంశెట్టి శివ పేరుతో ఆంధ్రా బ్యాంకు కృష్ణలంక బ్రాంచి అకౌంట్‌కు సంబంధించిన ఈ ఏటిఎం కార్డు బతికున్నప్పుడు సాయిశ్రీ కోసం వినియోగించేవారు. కాగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఫ్లాట్‌ను రెండు రోజుల్లో మాదంశెట్టి శివ స్వాధీనం చేసుకుని తాళాలు నగర పోలీసు కమిషనర్‌కు అప్పగించనున్నట్లు తెలిసింది. దీంతో బహుశా ఆయన చేతులమీదుగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి స్వాధీనం చేయవచ్చని సమాచారం.